Skin Tips with Charcoal : బొగ్గుతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. నల్లగా ఉండే బొగ్గుతో ఏం ఉపయోగాలు అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ బొగ్గులోనే ఎన్నో అందానికి సంభందించిన రహస్యాలు దాగి ఉన్నాయి. రోజురోజుకీ వాతావరణ కాలుష్యం పెరగడం వల్ల అమ్మాయిల ముఖచర్మము దెబ్బతింటుంది.
జీవము లేనట్టుగా ముఖవర్చస్సు మారిపోతుంది. అలాంటి పరిస్థితులలో వాళ్ళు ఖచ్చితంగా బ్యూటీ పార్లర్ ని ఆశ్రయిస్తూ ఉంటారు. కాంతివంతమైన ముఖం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ డబ్బు వృధా చేస్తూ తిరగాల్సిన పని ఇక లేదు. మనకు సులభంగా దొరికే వస్తువులతోనే అందాన్ని కాపాడుకోవచ్చు.
బొగ్గుతో ఫేస్ కి ప్యాక్ వేసుకోవచ్చు. బొగ్గును మెత్తటి పొడిలాగా చేసి ఈ ప్యాక్ ని తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పేస్ట్ ని ముఖానికి అప్లై చేసిన తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజు తర్వాత రోజు చేయడం వల్ల మీ ముఖవర్చస్సు పెరుగుతుంది. ముఖం మీద ఉండే గుంటలు, నల్ల మచ్చలు తొలగిపోవాలని ఎన్నో క్రీములను, వైద్య సలహాలను తీసుకుంటూ ఉంటాము.
కానీ వేటి వల్ల ఉపయోగం లేక ముఖం కాంతివిహీనంగా తయారవుతుంది. అలాంటప్పుడు మీరు ఫేస్ ప్యాక్ కోసం వాడే వాటిలో బొగ్గు పొడిని కలిపి ముఖానికి ప్యాక్ లాగా వేసుకుంటే, చర్మ మీద ఉండే మృతకణాలు, మురికి తొలగిపోతాయి. అలాగే చెమట, జిడ్డు సమస్యలు తొలగిపోతాయి. బొగ్గు పొడిని ఫేస్ ప్యాక్ గా వాడడం వల్ల చర్మము సహజత్వాన్ని నింపుకుంటుంది.