Smile : నవ్వు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెప్తూ ఉంటారు. అలాగే నవ్వు నాలుగు విధాల చేటు అని కూడా పెద్దలు చెప్తుంటారు. ఉదయం లేచిన దగ్గరి నుండి, తిరిగి రాత్రి పడుకునే వరకు ఒక మనిషి జీవితంలో ఎన్నో టెన్షన్లు, ఒత్తిడిలు, సమస్యలు వాటితో సతమతమవుతూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో ఒక చిరునవ్వు ఆ మనిషిని చాలా రిలాక్స్ చేస్తుంది. కానీ అదే నవ్వు ఆపకుండా కంటిన్యూగా నవ్వితే ప్రాణానికి ప్రమాదమా..? దానివల్ల చనిపోయే అవకాశాలు ఉన్నాయా..?
ఆపకుండా నవ్వినా వారిలో కొన్ని విచిత్రకరమైన మార్పులు జరుగుతూ ఉంటాయి. దీనికి కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఉదాహరణగా చెప్తారు. క్రీస్తుపూర్వం మూడో శతాబ్దంలో Chrysippus అనే గ్రీకు తత్వవేత్త మరణం 2 కారణాలుగా సంభవించింది అని చెబుతారు. మొదటి కారణంగా ఆయన అధిక మద్యం సేవించడం వల్ల మరణించారని చెబుతూ,
రెండవ కారణం అతను ఒక సందర్భంలో వ్యంగ్యంగా మాట్లాడుతూ బిగ్గరగా ఆపకుండా నవ్వడం వల్ల మరణించారని చెబుతారు. అలాగే నేటి ఆధునిక కాలంలో కూడా 1975లో అలెక్సా మిషన్ అనే బ్రిటిష్ ర్ పాపులర్ కామెడీ చూస్తూ 30 నిమిషాలు ఆపకుండా నవ్వాడంట…ఆ తర్వాత అతను చనిపోయాడని చెప్తూ ఉంటారు. అదేవిధంగా 2003లో థాయిలాండ్ కు చెందిన ఒక ఐస్ క్రీమ్ డ్రైవర్ నిద్రలో బిగ్గరగా నవ్వి అక్కడికక్కడే మరణించారని చెప్తారు.
మన దేశంలోనూ ఇటువంటి సంఘటనలు జరగకపోలేదు. 2013లో మహారాష్ట్రలో 22 ఏళ్ల వయసున్న మంగేష్ బోగల్ ఒక యువకుడు స్నేహితుడితో “గ్రాండ్ మస్తీ” అనే కామెడీ సినిమాకు వెళ్ళాడు. అతను ఆ సినిమా చూస్తూనే గట్టిగా నవ్వి ,నవ్వి గుండెపోటుకు గురై అక్కడే మరణించాడు.పైన ప్రస్తావించిన ఘటనలన్నీ కూడా అధికంగా నవ్వడం వలన సంభవించినవని నిపుణుల పర్యవేక్షణలో తేలిన వాస్తవాలు.
మానవ శరీరంలో నిరంతరము అంతర్గత కార్యకలాపాలు జరుగుతూనే ఉంటాయి. అయితే నవ్వు మనిషికి ఆరోగ్యకర ప్రయోజనాలు తీసుకువచ్చినప్పటికీ, అధికంగా నవ్వడం మాత్రము ఆరోగ్య సమస్యలను ఖచ్చితంగా తెస్తుంది. ఇలా నవ్వినప్పుడు ఏదైనా సమస్య అనిపించినప్పుడు వెంటనే వైద్య సలహాలు తీసుకోవాలి, లేకపోతే ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
.