Stomach Cleansing Tips : మన బాహ్య శరీరాన్ని ఎలా క్లీన్ గా చూసుకుంటామో, అంతర్భాగంలో కూడా ముఖ్యంగా పొట్ట భాగంలో క్లీన్ గా ఉండాలి. పొట్ట భాగం క్లీన్ గా ఉండకపోతే చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. రోజు పొట్టను శుభ్రంగా ఉంచుకోవడానికి కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. అలాగే మనం తీసుకునే ఆహారంలో కూడా జాగ్రత్త పడాలి. అయితే పొట్టను ఎలా క్లీన్ చేసుకోవాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి తెలుసుకుందాం..
పొట్ట శుభ్రంగా ఉండాలంటే ముఖ్యంగా పీచు పదార్థాలను తీసుకోవాలి.జీర్ణక్రియ సక్రమంగా నడిచేలాగా పీచు పదార్థాలు ఉపయోగపడతాయి. తాజా కూరగాయలను, క్యారెట్లను, బీన్స్, శనగలు, ఓట్స్ ఇలా ఫైబర్ ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటే పొట్ట ఈజీగా క్లీన్ అవుతుంది. అలాగే నీళ్లను సరిపోయే విధంగా తాగాలి. ముఖ్యంగా రోజు పరిగడుపున ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో

తేనె, నిమ్మరసం కలుపుకొని తాగితే పొట్ట క్లీన్ అవుతుంది. ఇది సహజసిద్ధమైన ప్రక్రియ. దీన్ని ప్రతి ఒక్కరూ అవలంబించవచ్చు. అలాగే పరగడుపున పండ్ల జ్యూసులు కూడా పొట్టను క్లీన్ చేస్తాయి. అంతేకాకుండా గోరువెచ్చని తేనె, నిమ్మ నీళ్లు, పండ్ల రసాలు బరువును కూడా నియంత్రణలో ఉంచుతాయి. కానీ ఇవన్నీ చేయడానికి మనకు సమయం సరిపోకపోవచ్చు. అయితే పొట్ట భాగం క్లీన్ గా ఉండాలంటే కాఫీ,
టీలకు బదులుగా పొట్ట క్లీన్ గా ఉండేందుకు ఉపయోగపడే హెర్బల్ టీలు తాగడం మంచిది. వీటిలో ఉండే యాంటీ మైక్రోబియల్ కెమికల్స్ ఉండడం వల్ల పేగుల్లో ఉన్న చెడు బ్యాక్టీరియాని తగ్గించి, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా నియంత్రిస్తాయి. అలాగే పేగుల కదలికను కూడా సజావుగా జరిగేలాగా ఇవి దోహదపడతాయి. ఈ చిన్న ,చిన్న టిప్స్ వల్ల మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు.
