Stretch Marks : సాధారణంగా ప్రతి మహిళకు ప్రసవం తర్వాత పొట్ట పైన స్ట్రెచ్ మార్క్స్ వస్తుంటాయి. అవి ఉన్నచోట శరీరం సాగినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. వీటి వల్ల ఆరోగ్యానికి ఎటువంటి నష్టం లేకపోయినప్పటికీ, చూడడానికి మాత్రం కాస్త ఇబ్బందిగా అనిపిస్తాయి. స్ట్రెచ్ మార్క్స్ వల్ల ఇష్టమైన దుస్తులు ధరించడం కష్టమవుతుంది.
అయితే చాలామంది మహిళలు వీటిని నివారించేందుకు ఏవేవో చిట్కాలు పాటిస్తూ ఉంటారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ చారలు పోవు. ఈ చారలు పోవడానికి ఒక అద్భుతమైన రెమిడి అందుబాటులో ఉంది. అది మన ఇంట్లో స్వయంగా తయారు చేసుకొని వాడుకోవచ్చు. మొదట ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు వాసలిన్,
వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ ఆముదం, వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఆఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి అన్నింటిని బాగా మిక్స్ అయ్యేవరకు కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని పొట్ట పైన అప్లై చేసి సున్నితంగా వేళ్ళతో ఓ పది నిమిషాల పాటు మసాజ్ చేయాలి. రాత్రి పడుకునే సమయంలో ఇలా చేసి, ఉదయాన్నే గోరువెచ్చని నీటితో చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి.
స్ట్రెచ్ మార్క్స్ నివారించడానికి ఈ రేమిడి చాలా బాగా ఉపయోగపడుతుంది. క్రమం తప్పకుండా ఈ చిట్కాని ఫాలో అయితే స్ట్రెచ్ మార్క్స్ పోగొట్టుకోవచ్చు. అలాగే ఈ మిశ్రమం వల్ల సాగిన పొట్ట చర్మం కూడా టైట్ గా మారుతుంది. కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా ఈ రెమిడీని పాటించి మీ సమస్యను తొలగించుకోండి.