Tech Tips : ఎవరి చేతుల్లో చూసిన ఇప్పుడు మొబైల్ కనిపిస్తుంది. మంచి ఫోన్ కొనుక్కొని ఎక్కువ కాలం వాడాలి అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆఫ్ లైన్ లో అయినా ఆన్లైన్లో అయినా నకిలీ ఫోన్లు వచ్చేసాయి. అలాంటప్పుడు వినియోగదారుడు అయోమాయంలో పడడం సహజమే.
మార్కెట్లో ఆఫర్స్ రాగానే తక్కువ ధరకు ఫోన్ వచ్చేస్తుంది కదా.. అని వినియోగదారులు పరిగెత్తుతారు అనే విషయం కొనుగోలుదారులకు తెలుసు. దాన్ని ఆసరాగా చేసుకొని నకిలీ స్మార్ట్ ఫోన్ అమ్మేవాళ్ళ సంఖ్య రోజు రోజుకి ఎక్కువైపోతుంది.
ఈ మధ్యకాలంలో నకిలీ ఫోన్లు అమ్మే ముఠాలను కూడా పోలీసు అరెస్ట్ చేశారు. ఒక వ్యక్తి 12 వేలకు బయట మార్కెట్లో ఫోన్ కొనుక్కొని, షాపింగ్ వెబ్సైట్లో ఐఫోన్ లాంటి బాక్సులు కొని, ఆపిల్ స్టిక్కర్ ని దానిపై అతికించి, తాను కొన్న 12 వేల రూపాయల ఫోన్ ను ఆ బాక్స్ లో పెట్టి అమ్మేశాడు. ఇప్పుడు ఇలాంటి మోసాలు కోకొల్లలు.
ఇలా గుర్తించండి..
* మనం ఫోన్ కొనేముందు దానిమీద IMEI నెంబర్ ఉందో లేదో గమనించాలి. ఎందుకంటే ఒరిజినల్ ఫోన్ లో మాత్రమే IMEI నెంబర్ ఉంటుంది.
* ఈ IMEI నెంబరు స్మార్ట్ ఫోన్ సెట్టింగ్ లో గాని బాక్స్ పైన గాని ఉంటుంది.
* లేకపోతే *#06# కు డయల్ చేసి 15 అంకెల IMEI నెంబర్ ను మరో మార్గంగా కూడా తెలుసుకోవచ్చు.
* ఇంకో మొబైల్ స్మార్ట్ ఫోన్ తో అయినా ఈ నెంబర్ కి కాల్ చేస్తే IMEI నెంబర్ తెలుసుకొవడం ఇంకా ఈజీ అవుతుంది.
అన్ని ప్రయత్నాలు చేసినా కూడా IMEI నెంబర్ కనిపించలేదు అనుకోండి ఆ ఫోన్ ఖచ్చితంగా నకిలీది అని అర్థం. ఒకవేళ మీరు ఫోన్ గురించి ఎలా తెలుసుకోవాలో అర్థం కాకపోతే మీకు దగ్గరలో ఉండే మొబైల్ స్టోర్ కి వెళ్లి IMEI నెంబర్ అడిగితే ఫోన్ ఒరిజినలా కాదా అనేది బయటపడిపోతుంది. తక్కువ ధరలో ఫోన్ కావాలనే మీ అత్యాశే నకీలీదారుకాలకు అవకాశం ఇస్తుందని మరిచ్చిపోకండి..
Discussion about this post