పుట్టిన రోజు, పెళ్లి రోజు అనగానే ఏదైనా గిఫ్ట్ ఇస్తూ మన అభిమానాన్ని చాటుకుంటాం. కానీ కొన్ని వస్తువులు గిఫ్ట్ గా ఇవ్వడం వలన వారికి మేలుకు బదులుగా కీడు జరిపే అవకాశం ఉంది. ఆ వస్తువులు ఏంటీ, గిఫ్ట్ గా ఏం ఇవ్వకూడదో చూద్దాం..
టవల్: తువ్వాలు, కర్చీఫ్‌లు ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఈ టవల్‌ను బహుమతిగా ఇవ్వడం వల్ల వారి జీవితం నిరాశతో నిండుతుంది.
నీటిని కలిగి ఉన్నవి: మనం సాధారణంగా గృహాలంకరణ వస్తువులను బహుమతిగా ఇస్తాము. అక్వేరియం, మొక్కలు తదితర వాటిని కూడా ఇస్తూ ఉంటాం. కానీ నీరు ఉన్న వస్తువులను బహుమతిగా ఇవ్వవద్దు. దీనివల్ల మీకు ఆర్థిక సమస్యలు వస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.
దేవుని విగ్రహం : మన సంప్రదాయంలో భగవంతుని ప్రతిరూపానికి చాలా ప్రాముఖ్యం ఉంది. కాబట్టి సాధారణంగా చాలా వేడుకలకు దేవుని విగ్రహాన్ని బహుమతిగా ఇస్తారు. అయితే ఈ విగ్రహాలకు సక్రమంగా పూజలు చేయకపోతే.. వాటిని ఇచ్చిన వారికీ, తీసుకున్నవారికి కూడా సమస్యలు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు.
పెన్, పుస్తకం : పెన్ను, పుస్తకం లాంటి స్టేషనరీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. పెన్నులు, ఇతర వస్తువులను గిఫ్టుగా ఇవ్వడం వలన, వాటిని తీసుకున్నవారు ఎదగడానికి బదులుగా.. నష్టాల పాలవుతారని నిపుణులు చెబుతున్నారు.
బ్యాగ్ : అమ్మాయిలు ఎక్కువగా తమ గర్ల్‌ఫ్రెండ్స్‌కి బ్యాగ్‌లను బహుమతిగా ఇస్తుంటారు. కానీ.. వాస్తుశాస్త్రం ప్రకారం ఇలా బ్యాగ్ ఇవ్వడం అంటే.. మీ ఆర్థిక పరిస్థితిని వారికి ఇచ్చినట్లే. అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా పర్సులు బహుమతిగా ఇవ్వకూడదు.
పదునైన వస్తువులు : గృహప్రవేశం, వివాహ సమయంలో మనం వంటగదిలో వాడుకునే వస్తువుల్ని గిఫ్టుగా ఇస్తుంటాం. అవి పదునైన వస్తువులు కాకూడదు. కత్తి, పదునైన స్పూన్లు ఇవ్వకూడదు. అవి మీకు, తీసుకున్నవారి మధ్య సంబంధాన్ని దెబ్బతీస్తాయని చెబుతున్నారు.
ఊరగాయ: ఏ కారణంగానైనా పచ్చళ్లను బహుమతిగా ఇవ్వకూడదు. వాటిలో ఉప్పు ఉంటుంది. ఉప్పు ఎవరికీ ఉచితంగా ఇవ్వకూడదు. ఎవరికైనా పచ్చళ్లు ఇస్తే వారి నుంచి 1 రూపాయి తీసుకుంటే మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ఎండిన పువ్వులు: పువ్వులు బహుమతిగా ఇవ్వడం ఒక సంప్రదాయం. పువ్వులు.. ప్రేమ, ఆనందం, శోభ, సువాసనను సూచిస్తాయి. కానీ ఎండిన పువ్వులు.. జీవితంలో నష్టం, నొప్పికి చిహ్నం. కాబట్టి ఎండిన పువ్వులను ఇవ్వవద్దు.
