Tips to Get Rid of Bad Smell at Home : మన ఇల్లు ఎప్పుడు సుగంధ పరిమాళంతో ఉండాలి అంటే, కొన్ని టిప్స్ ని పాటించాలి. ఎందుకంటే ఇంట్లోనే సింక్ ఉంటుంది. అప్పుడప్పుడు ఇంట్లో నాన్ వెజ్ కి సంబంధించిన వంటకాలు కూడా చేస్తుంటాము. అలాంటప్పుడు ఇల్లు కాస్త నీచు వాసనతో నిండిపోతుంది. అలాంటి వాసన నుంచి బయటపడాలి, ఇల్లు ఎప్పుడు స్వచ్ఛమైన వాసనతో నిండి ఉండాలి అంటే కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఆలస్యం చేయకుండా ఆవేంటో తెలుసుకుందాం..
ఎయిర్ ఫ్రెషనర్
ఇల్లును మంచి వాసనతో నింపడానికి ఇప్పుడు చాలా రకాల హెయిర్ ప్రెషనర్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. వాటిని ఫ్లగ్ కి పెట్టి స్విచ్ వేస్తే చాలు మీ ఇల్లు మొత్తం సుగంధ పరిమళంతో నిండిపోతుంది. తక్కువ సాంద్రత ఉన్న వాటిని మాత్రమే వాడాలి. ఎక్కువ సాంద్రత ఉన్నవి వాడకపోవడమే మంచిది. లేకపోతే అగరవత్తులు వెలిగించి పెట్టుకోవడం వల్ల కూడా మంచి వాసన ఇల్లంతా నిండిపోతుంది.
సెంటెడ్ క్యాండిల్స్
సెంటెడ్ క్యాండిల్స్ కూడా ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని గదుల్లో ఒక మూలలో పెట్టి వదిలేయాలి. వాటి వల్ల వచ్చే వాసన వల్ల ఇల్లు మొత్తం చాలా ఆహ్లాదంగా మారిపోతుంది.
నిమ్మ చెక్క
మన ఇళ్లలో ఎప్పుడు కూడా నిమ్మకాయలు అందుబాటులోనే ఉంటాయి. నిమ్మ చెక్కలను ఉపయోగించి కూడా ఇల్లును సువాసనతో నింపవచ్చు. లేకపోతే దాల్చిన చెక్క, పచ్చ కర్పూరం కూడా వాడుకోవచ్చు. ముఖ్యంగా నిమ్మ చెక్క అయితే బాగా పనిచేస్తుంది. స్టవ్ ని వెలిగించి గిన్నెలో నీళ్ళు పోసి మరగపెట్టిన నిమ్మ చెక్క గాని, కర్పూరం గాని, దాల్చిన చెక్క గాని వేసి మరిగిస్తే, ఆ వాసన ఇల్లు నలుమూలల వ్యాపించి మన మనసుకు ఆహ్లాదాన్ని అందిస్తుంది.