Upasana Donate Her Remuneration : టాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్స్ లో రామ్ చరణ్, ఉపాసన జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం స్టార్ హీరో వైఫ్ గానే కాకుండా ఉపాసన తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ఆమె మహిళా వ్యాపారవేత్త, సోషల్ ఆక్టివిస్ట్. అపోలో హాస్పిటల్స్ చైర్ పర్సన్. అలాగే ఫ్యామిలీ హెల్త్ ప్లాన్ ఇన్సూరెన్స్ టిపిఏ లిమిటెడ్ డైరెక్టర్ కూడా.
బి పాజిటివ్ పేరుతో ఓ ఫిట్నెస్, లైఫ్ స్టైల్ మ్యాగజైన్ కూడా నడుపుతున్నారు ఉపాసన. ఇదిలావుండగా తాజాగా ఉపాసన తన సంపాదనను మహిళల కోసం విరాళంగా ఇచ్చి మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు. గురువారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో హౌజ్ ఆఫ్ టాటా నుంచి జోయా కొత్త స్టోర్‌ను ప్రారంభించారు ఉపాసన. అయితే ఈ స్టోర్ ప్రారంభంచినందుకు గాను
యాజమాన్యం ఇచ్చిన రెమ్యునరేషన్‌ను దోమకొండ ఫోర్ట్ అండ్ విలేజ్ డెవలప్‌మెంట్ ట్రస్ట్, దాని కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వాలని ఉపాసన నిర్ణయించుకున్నారు. అణగారిన వర్గాలకు చెందిన మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు ట్రస్ట్ పని చేస్తుందని ఉపాసన తెలిపారు. ఈ విషయంలో తెలియడంతో నెటిజన్స్ మా వదిన బంగారం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.