Uses of Porridge : మన తాతలు, అమ్మమ్మల కాలంలో గంజిని తాగేవారు. వారు అప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉండే వాళ్లు కూడా, కానీ ఈ రోజుల్లో మనం ఆధునిక ఫుడ్ కి అలవాటు పడిపోయి, ఇలాంటి వాటిని చాలా నెగ్లెట్ చేస్తున్నాం. వాస్తవానికి గంజిని తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ రోజులలో కూడా మనం ఇంత మంచి ఆహారాన్ని అలవాటు చేసుకుంటే చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు.
బియ్యంతో తయారైన ఈ గంజిలో ఇనోసెటాల్ అధికంగా ఉండడం వల్ల మన శరీరం, చర్మం కాంతివంతంగా మారడమే కాకుండా జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది. చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. మానసికంగా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇందులో ఉండే ఖనిజ లవణాలు కడుపులో మంట, నొప్పి రాకుండా జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తాయి.

గంజిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు లేదా పచ్చిమిర్చి, ఉప్పుని వేసి కలిపి తాగితే రుచి అమోఘంగా ఉంటుంది. అలా కాకుండా మరో మార్గంలో రాత్రి పూట తీసిన గంజిని ఉదయం పులిసాక కూడా తాగితే శరీరానికి మంచి బలాన్ని ఇస్తుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారు గంజిని తీసుకుంటే సమస్య తగ్గుముఖం పడుతుంది. వాంతులతో బాధపడేవారు కూడా గంజిని తాగవచ్చు. ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా గంజి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
శరీరం కోల్పోయిన పోషకాలను ఈ గంజి మనకు అందిస్తుంది. గంజిలో ఫైబర్, ప్లేటో కెమికల్స్, మెగ్నీషియం, పొటాషియం వంటివి అత్యధికంగా ఉండి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. రక్తపోటు అదుపులో ఉంటే గుండెకు చాలా మంచిది. గుండె సమస్యలు గుండెపోటు వంటివి తలెత్తవు.
