Vastu Shastra : నిద్ర లేవడంతోనే అందరూ ఆరోజు ఎంతో సంతోషంగా సాగిపోవాలి అనుకుంటారు. ఎలాంటి నష్టం జరగకుండా ఆ రోజంతా సవ్యంగా సాగిపోవాలని కోరుకుంటారు. అలాగే కొంతమంది తమకు ఇష్టమైన వాళ్ళ మొహం చూస్తుంటారు. ఇంకొంత మంది తమ అర చేతులు చూసుకొని లేస్తుంటారు. అయితే కొన్ని వస్తువులను చూడడం వల్ల ఆ రోజు మొత్తం హ్యాపీగా గడిచిపోయి మంచి జరుగుతుందని అంటున్నారు పండితులు. అలాగే మంచికి తోడుగా చెడు కూడా ఉన్నట్టు చూడకూడని వస్తువులు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
నిద్రలేవడం తో చూసే వస్తువులు..
* ఉదయం నిద్ర లేవగానే మీ ఇష్టమైన దైవాన్ని తలచుకొని ఆ దేవుడి ఫోటోలను చూడటం మంచింది.
* ఉదయం నిద్ర లేవగానే ఆవును చూడటం చాలా శ్రేయస్కరం. ఆవు సకల దేవతలతో సమానం. ఆవును చూస్తే సమస్త దేవతల దర్శనం చేసుకున్నట్టే అవుతుందని పండితులు చెబుతున్నారు.
* ఉదయం నిద్ర లేవగానే గుడిలో గంటల శబ్దం వినడం వల్ల మనకు పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది.
* తెల్లవారుజామున సుమంగళిని చూడటం కూడా చాలా శుభప్రదం. ఆమె చేతిలో పూజాఫలాన్ని చూడటం కూడా ఎంతో మంచిది ఆరోజు మొత్తం శుభంగా సాగిపోతుంది..
* కొంతమంది వారి పిల్లల మొహాలను లేదంటే వారికి ఇష్టమైన వారి ఫోటోలను చూస్తూ ఉంటారు. ఇలా చూసేవాళ్ళు చాలా హ్యాపీగా ఆ రోజు మొత్తం ఉంటారు అని పండితులు చెప్తున్నారు.
* ఇక ఉదయం లేవగానే అద్దంలో మీ మొహాన్ని మీరు చూసుకోవటం కూడా మీకు ఎంతో ఉత్సాహాన్ని, కాన్ఫిడెంట్ ని, పాజిటివ్ ఎనర్జీని 100 శాతం కలిగిస్తుందని పండితులు చెబుతున్నారు. అయితే పాచి మొహంతో కాకుండా నీళ్లతో మొహాన్ని కడుక్కొని అద్దంలో చూడడం మంచిది.
* పాలు, పెరుగు వంటి పదార్థాలను చూడటం కూడా ఆ రోజంతటికి శుభ పరిణామం.
* ఉదయం లేవగానే పక్షులు చేసే ధ్వనులు విన్నా కూడా శుభమని పండితులు చెబుతున్నారు.
చూడకూడని వస్తువులు..
* ముఖ్యంగా భయంకరమైన జంతువుల ఫోటోలను అస్సలు చూడకూడదు. అలాంటి జంతువుల ఫోటోలు కనుక చూస్తే ఆరోజు మొత్తం మనలో ఏదో తెలియని భయం, ఆందోళన కలిగి ఆ రోజు మొత్తం టెన్షన్ తో గడిచిపోతుందని పండితులు సూచిస్తున్నారు.
* రాత్రి తిని పెట్టిన పాచి గిన్నెలను ఉదయం నిద్ర లేవగానే చూడకూడదు. అలా చూడటం వల్ల ఆ రోజు మొత్తం ఎన్నో ఆటంకాలను, సమస్యలను, ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.