Vastu Tips : ఇంటిని అలంకరణ చేసుకోవాలని, అలంకరణలో ప్రత్యేకంగా వస్తువుల్ని పెట్టుకొని సర్దుకోవాలి, శుభ్రంగా ఉంచుకోవాలని చాలామందికి ఉంటుంది. ఇల్లు ఎంత అలంకరిస్తే అంత శోభాయమానంగా వెలిగిపోతుంది .అయితే వాస్తు ప్రకారం కొన్ని చిట్కాలు పాటిస్తే అలంకరణతో పాటు ఆనందం, అదృష్టం కూడా మీ సొంతమవుతుంది. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వస్తువులును రంగులును బట్టి వాడితే మంచి ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే మనం ఇంటికి వాడే డోర్ కర్టెన్స్ విషయంలో కూడా ఈ నియమాలు పాటించాలని చెప్తున్నారు నిపుణులు. లేకపోతే సమస్యలు తప్పవని వారి అభిప్రాయం.
ఇంట్లో తరచుగా మనస్పర్ధలు వస్తుంటే, ఎప్పుడు గొడవలతో నిండిన వాతావరణం ఉంటే, అలాంటి స్థితిలో దక్షిణం వైపున ఎరుపు రంగు డోర్ కాటన్ వేయడం వల్ల, ఆ ఇంటి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు, మంచి సంబంధాలు ఏర్పడి, సమస్యల నుంచి తప్పించుకోవచ్చు అని చెప్తున్నారు నిపుణులు.
అలాగే తెలుపు రంగు శాంతికి ,ప్రశాంతతకు చిహ్నం. మీ పడక గది, మీ ఇంటికి పడమర వైపున ఉన్న తలుపులకు తెల్లటి కర్టెన్లను ఉపయోగించడం ద్వారా ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోయి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ఆ కుటుంబ సభ్యుల మధ్య సంతోషకరమైన సత్సంబంధాలు నెలకొంటాయి. కుటుంబాల్లో చాలా మంచి జరుగుతుందనీ నిపుణులు తెలుపుతున్నారు.