Vijay Deverakonda: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఫ్యాన్ ఫాలోయింగ్, యూత్ లో ఆయనకున్న క్రేజ్ గురించి తెలిసిందే. అర్జున్ రెడ్డి, గీతా గోవిందంతో మాస్ అండ్ క్లాస్ ఆడియెన్స్ కు చేరువయ్యాడు. ఇటీవల విడుదలైన పాన్ ఇండియా మూవీ భారీ అంచనాల నడుమ విడుదలై నిరుత్సాహ పరిచినప్పటికీ, మరోవైపు వరుస సినిమాలు చేస్తూనే వ్యాపార, క్రీడారంగంలోకి అడుగుపెట్టాడు విజయ్.
ఇండియాలోనే నెంబర్ వన్ ప్రొఫెషనల్ టీమ్ లలో ఒకటైన హైదరాబాద్ బ్లాక్ హాక్స్ సహ యజమానిగా మారాడు. ఇదిలా ఉండగా విజయ్ సామాజిక కార్యక్రమాల్లో కూడా ముందుంటాడు. ఆ మధ్య కరోనా సమయంలో ఎంతో మందికి సహాయం అందించాడు విజయ్. తాజాగా ‘దేవర శాంటా-2022’ పేరుతో దేశవ్యాప్తంగా 100 మందిని ఎంపిక చేసి తన సొంత ఖర్చులతో టూర్ కి పంపించిన విషయం తెలిసిందే.
అయితే, వారంతా టూర్లో ఎలా గడిపారో, తమతమ అనుభవాలను పంచుకుంటూ విజయ్ కి కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను విజయ్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతుంది. ఆ వీడియోలో విజయ్ ‘ఒకప్పుడు తాను టూరు వెళ్లేందుకు కూడా సరిపడా డబ్బులు ఉండేవి కాదు’ అని తెలిపాడు. ప్రస్తుతం విజయ్ ఖుషి మూవీతో పాటు, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి మూవీ చేయనున్న విషయం తెలిసిందే.