Vitamin E : విటమిన్ E లోపిస్తే కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, ముఖ్యంగా చర్మానికి సంబంధించిన రక్షణ కరువవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తూన్నారు. విటమిన్ E లోపం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయో.. వాటి నివారణ ఏంటో తెలుసుకుందాం.. విటమిన్ E అనేది ఒక శక్తివంతమైన యాంటీ యాక్సిడెంట్ మాత్రమే కాకుండా, ఇది కాలుష్యం, UV కిరణాలు, పర్యావరణ టాక్సిన్స్ తో వచ్చే హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి చర్మాన్ని కాపాడుతూ..
ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షించడంలో విటమిన్ E సమర్థవంతంగా పనిచేసి, మెరిసే ముఖాన్ని మీ సొంతం చేస్తుంది. విటమిన్ E లో ఉండే తేమ గుణాల వల్ల చర్మం హైడ్రేషన్ కాకుండా ఉండి మన ఒంట్లోనీ తేమను నిలుపుదల చేయడంలో సహాయం చేస్తుంది. E విటమిన్ వల్ల పొడిచర్మ సమస్య ఉండదు. అంతేకాకుండా విటమిన్ E గాయాలను మాన్పడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. తొందరగా గాయాలు మానిపోతాయి.
విటమిన్ E వల్ల చర్మం మృదువుగా మారి, చర్మంపై ఉన్నటువంటి మచ్చలు మాయమవుతాయి. ఆరోగ్యకరమైన కణాలను పునరుత్పత్తి చేయడంలో విటమిన్ E బాగా పనిచేస్తుంది. అలాగే మంటను తగ్గించడంలో కూడా దీని పాత్ర ఎక్కువగా ఉంటుంది. చర్మానికి విటమిన్ Eతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ ఆరోగ్య సమస్యలు, చర్మ సమస్యల నుంచి తప్పించుకోవాలంటే విటమిన్ E మన శరీరంలో పుష్కలంగా ఉండేలాగా చూసుకోవాలి.
మరి విటమిన్ E మనకు ఏ ఆహార పదార్థాలలో, ఏ పండ్లల్లో దొరుకుతుందో తెలుసుకుందాం.. ముఖ్యంగా ఈ విటమిన్ E.. పొద్దుతిరుగుడు విత్తనాలు, పాలకూర, బ్రోకలీ, బాదం, వేరుశెనగ, హజెల్ నట్స్, కూరగాయల నూనెలు, మామిడి, బెర్రీలు, అవకాడోలు, బచ్చలి కూర, గోధుమలు వీటిల్లో ఎక్కువగా లభిస్తుంది.. మీరు రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకున్నట్టు అయితే..చర్మ,ఆరోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు.