Walking Briskly does not Cause these Health Problems : ప్రతిరోజు నడక ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతుంటారు. క్రమం తప్పకుండా నడిస్తే గుండె సంబంధిత వ్యాధులు రావని ఆరోగ్యంగా ఉండవచ్చు అని, అందుకే ప్రతిరోజు అందరూ నడక కోసం సమయాన్ని కేటాయించాలని చెబుతారు. అయితే వేగంగా నడవడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు తెలుసుకుందాం.
రోజురోజుకు పెరుగుతున్న వ్యాధుల గురించి మనకు తెలిసిందే. దాంట్లో టైప్ టు డయాబెటిస్ కూడా ఒకటి అని చెప్పవచ్చు. అయితే దీనిని అధిగమించడానికి “ బ్రిటిష్ జర్నన్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్” వారు చేసిన ఒక అధ్యయనంలో వేగంగా నడవడం వల్ల టైప్ టు డయాబెటిస్ నుంచి బయటపడవచ్చు అని తెలిపారు.
అయితే దీని కోసం మీరు చేయవలసింది ప్రతిరోజు గంటకు నాలుగు కిలోమీటర్లు వేగంగా నడవడమే. నడక వేగం వల్ల టైప్ టు డయాబెటిస్ వచ్చే ప్రమాదం 15% తక్కువ ఉంటుందని వారి పరిశోధనలు వెళ్లడైంది. అలాగే గంటకు కనీసం నాలుగు నుంచి ఐదు కిలోమీటర్లు వేగంగా నడిస్తే డయాబెటిస్ బారిన పడకుండానే ఉండవచ్చు అని వారు తెలుపుతున్నారు. పురుషులు నిమిషానికి 87 అడుగులు, అలాగే మహిళలైతే నిమిషానికి 100 అడుగులు నడిస్తే సరిపోతుందని వారు వెల్లడించారు.
వారి అధ్యయనంలో ఇంకో ఆసక్తికర విషయాన్ని కూడా వెల్లడించారు. 2024వ సంవత్సరానికి టైపు టు డయాబెటిస్ సమస్య బారిన పడే వారి సంఖ్య 537 మిలియన్ల నుంచి 783 మిలియన్లకు చేరుతుందని వారు హెచ్చరించారు. అలాగే ఇరాన్ లోని “సెమినార్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్స్” లో కూడా పరిశోధనలు జరిపారు. వారు కూడా వేగంగా నడవడం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయని తెలిపారు. మానసిక, శారీరక ఆరోగ్య ప్రయోజనాలు నడకవేగంతో పొందవచ్చు అని, శరీరాన్ని ఎప్పటికీ ఉత్సాహంగా అలసట లేకుండా ఉంచవచ్చని వారి అధ్యయనంలో వెళ్లడైందని, కాబట్టి ప్రతిరోజు అందరూ నడకకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని వారు కోరారు.