Weight Loss : ఈ రోజుల్లో అందరూ ఎక్కువగా అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. దానిని తగ్గించుకోవడానికి వారు చేసే ప్రయోగాలు అన్ని ఇన్ని కాదు. అయినప్పటికీ బరువు సమస్య నుంచి వారు బయటపడలేకపోతున్నారు. మరి అధిక బరువును తగ్గించుకోవడానికి ఎటువంటి ప్రయోగాలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. బరువు సమస్య తగ్గించుకోవడానికి ముఖ్యంగా అందరూ వ్యాయామం చేస్తూ ఉంటారు.
చెమటలు బాగా వచ్చేలాగా వర్క్ అవుట్ చేస్తారు. కఠినమైన డైట్ ను ఫాలో అవుతుంటారు. అయినప్పటికీ కూడా వారు బరువు తగ్గరు. రోజు ఉదయం ఒక డ్రింక్ తీసుకుంటే అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు అని చెప్తున్నారు నిపుణులు. ఆ డ్రింక్ ఏంటి.. దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం.
స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి అవి మరిగాక దాంట్లో వన్ టేబుల్ స్పూన్ వాము, వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర, దాల్చిన చెక్క, మిరియాలు, నాలుగు లవంగాలు, వన్ టేబుల్ స్పూన్ నల్ల బెల్లం తురుము, పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి సన్నని మంట పైన 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి. అది గోరువెచ్చగా అయిన తర్వాత తాగితే దానిలో ఉండే గుణాల వల్ల మెటబాలిజం రేటు అధికమవుతుంది.
ఈ డ్రింక్ వల్ల శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోతుంది. తొందరగా వెయిట్ లాస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ డ్రింక్ తాగడం వల్ల బరువు సమస్య తగ్గుముఖం పడుతుంది. దీంతో ఏ డైట్ ని కూడా ఫాలో అలవాల్సిన అవసరం లేదు. కాకపోతే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్న ఆహారాన్ని ,బయట దొరికే జంక్ ఫుడ్ కి దూరంగా ఉంటే సరిపోతుంది.