హిందూ మతంలో ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. నేటికీ ఎంతోమంది వాటిని పాటిస్తున్నారు. అందులో కాళ్లకు పట్టీలు ధరించడం ఒకటి. అయితే కేవలం అందం, ఆకర్షణే కాదు అందులో సైన్స్ కూడా ఉందంటున్నారు పెద్దలు. నుదుటన బొట్టు, చేతికి గాజులు, కాళ్లకు పట్టీలు, చెవులకు దుద్దులు, ముక్కుకు ముక్కెర ఇలా ప్రతి భాగానికి ఒక్కో ఆభరణం. ఇవన్నీ కూడా ఆయా ప్రాంతాల్లో మన శరీరంలో మొత్తం అనుసంధానమై ఉన్న నరాలను ఒత్తిడికి గురి చేస్తాయి.
ఆ ఒత్తిడి వల్ల మన శరీరంలో కొన్ని హార్మోనులు విడుదల అవుతూ నరాల వ్యవస్థను ఉత్తేజపరిచి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. కాళ్లకు ధరించే పట్టీలు 90% వెండివే. వెండి మన శరీరానికి తగిలినపుడు జరిగే రసాయన చర్య మరియు విడుదలయ్యే ఎలక్ట్రానులు కాళ్ళ భాగంలో ఉన్న నరాలను ఒత్తిడికి గురి చేస్తాయి. దీని ద్వారా నరాల్లో విద్యుత్ ప్రవహించి శరీరంలో ఉన్న అసమతుల్యతలను క్రమబద్ధీకరిస్తుంది. కాళ్లకు వెండి పట్టీలు ధరించడం వల్ల మన శరీరంలో త్రిగుణాలుగా పిలువబడే వాత, పిత్త, కఫ దోషాలను అదుపులో ఉంచుతుంది.
గర్భసంచికి సంబంధించిన సమస్యలను తగ్గించడంలో కాళ్ళ పట్టీల ప్రాధాన్యత చాలా ఉంది. ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిల్లో ఎదురవుతున్న సమస్య పీరియడ్స్ సరిగా రాకపోవడం. పట్టీలు ధరించడం వల్ల నెలసరి సమస్యలను కూడా సులువుగా అధిగమించవచ్చు. ఆడవాళ్ళలో ఉన్న మానసిక ఒత్తిడి ద్వారా ఉత్పన్నమవుతున్న హార్మోన్ ఇంబాలెన్సు కూడా కాళ్లకు పట్టీలను ధరించడం ద్వారా నియంత్రించవచ్చు. కాబట్టి పట్టీలు కేవలం అందం కోసమే కాకుండా మహిళలు వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కూడా తోడ్పడతాయి.
