What Fruits to Eat in the Morning : ప్రతిరోజు పరిగడుపున బ్రేక్ ఫాస్ట్ చేస్తే మంచిదని చాలామంది భావిస్తుంటారు. ఉదయాన్నే ఖాళీ కడుపున ఉంచకూడదు. కచ్చితంగా అల్పాహారం తీసుకోవాలి అని వైద్యులు కూడా సూచిస్తారు. అయితే బ్రేక్ ఫాస్ట్ స్థానంలో పండ్లను కూడా తీసుకోవచ్చా.? చాలావరకు ఉదయాన్నే పండ్లు తినడం మంచిది కాదు అని ఒక అభిప్రాయంతో ఉంటారు. కానీ అది వాస్తవం కాదు.
ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ ప్లేస్ లో తాజా పండ్లను కూడా తీసుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. మరి ఉదయాన్నే తీసుకోవాల్సిన పండ్లు ఏమిటి..? వాటివల్ల మన శరీరానికి ఎలాంటి లాభం చేకూరుతుంది.. ఇప్పుడు తెలుసుకుందాం..
బొప్పాయి : ప్రతిరోజు ఉదయాన్నే బొప్పాయి తినడం చాలా మంచిది. ఇది శరీరానికి కావలసిన చాలా రకాల పోషకాలను అందిస్తుంది. దానివల్ల ఆ రోజంతా మనం నీరసానికి దూరంగా ఉండవచ్చు. చాలా ఉత్సాహంగా మన పనులు చేసుకోవచ్చు. ఉదయం పూట ఒక కప్పు బొప్పాయి మొక్కలు తింటే చాలా శక్తి మన శరీరానికి చేకూరుతుంది. అంతేకాదు ఈ బొప్పాయి పండు రక్తహీనతను కూడా దరిచేరనివ్వదు.
అరటిపండు : ఉదయం పూట తినదగిన పండ్లలలో అరటిపండు కూడా చాలా మంచిది. ఇది మన శరీరం కావలసిన శక్తిని తక్షణమే అందిస్తుంది. అలాగే శరీరంలోని ఎముకలను హెల్తీగా ఉంచడానికి బాగా ఉపయోగపడుతుంది. ఒత్తిడిని దూరం చేయడమే కాకుండా, మన మెదడును కూడా చాలా చురుగ్గా ఉంచడంలో అరటిపండు దోహదపడుతుంది.
పుచ్చకాయ : పుచ్చకాయ కూడా మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ టైం లో తీసుకోవచ్చు. మనం రోజు మొత్తంలో పనుల ఒత్తిడి వల్ల నీటిని తాగడంలో చాలా అశ్రద్ధ చూపుతుంటాము. అలాంటప్పుడు అనారోగ్య సమస్యలు మనకు వస్తాయి. వాటి నుంచి అధిగమించాలంటే నీటి శాతం శరీరానికి చాలా అవసరం కాబట్టి, పుచ్చకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. బాడిని రిఫ్రెష్ చేయడమే కాకుండా, మనలో ఏఖాగ్రతను కూడా పెంచుతుంది. జీర్ణక్రియ యాక్టివ్ గా పని చేయడానికి పుచ్చకాయ బాగా దోహదపడుతుంది. రక్తపోటును కూడా నియంత్రణలో ఉంచుతుంది.