Which Vitamin Deficiency Causes Anger : మనుషులకి కోపం రావడం సహజం. కానీ కోపం శృతిమించితేనే ప్రమాదం. కోపం రావడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. అసహజంగా కోపం వస్తే దానిని పరిగణలోనికి తీసుకోవాలి. పరిష్కారాలు వెతకాలి. కోపం కొన్ని విటమిన్స్ లోపం వల్ల కూడా వస్తుంది. అవును మీరు వినేది నిజమే. కోపం రావడానికి మన శరీరంలో విటమిన్స్ లోపం అని కూడా వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఆ విటమిన్స్ ఏంటో తెలుసుకొని, కోపాన్ని ఎలా నియంత్రించుకోవాలో ఇప్పుడు చూద్దాం.
విటమిన్ బీ6
విటమిన్ బీ6 లోపం ఉంటే తరచుగా కోపం వస్తుంది. విటమిన్ మెదడుపై ప్రభావాన్ని చూపుతుంది. మెదడు పనితీరు సరిగ్గా పని చేయకుంటే ఆహారంలో విటమిన్ బి6 లోపం ఉన్నట్లే.
విటమిన్ బీ12
ఈ విటమిన్ లోపం వల్ల ఎప్పుడు అలసట, నీరసం ఎక్కువగా ఉంటుంది. అనవసరమైన విషయాలకు చిరాకు రావడం ఈ విటమిన్ లోపమే. ఇక విటమిన్ బీ12 లోపం వల్ల డిప్రెషన్‌కు కూడా గురవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జింక్
శరీరానికి తగినంత జింకు లభించకపోతే ఆ ప్రభావం మానసిక ఆరోగ్యం పై పడి మానసిక కల్లోలం, చిరాకు, డిప్రెషన్, ఆందోళన లాంటివి వస్తాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి శరీరానికి తగిన మోతాదులో జింక్ ఉండేలా చూసుకోవాలి.
మెగ్నిషియం
మెగ్నీషియం లోపిస్తే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. శరీరానికి సరిపడా మెగ్నీషియం అందకపోతే ఒత్తిడి పెరిగి చికాకు కలుగుతుంది. ఈ లోపాన్ని సరైన సమయంలో గుర్తించాలి.