World Hypertension Day 2023 : ఈరోజుల్లో అనారోగ్య సమస్యలు వయసు బేదం లేకుండా అందరికీ వస్తున్నాయి. వాటిల్లో ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా రక్తపోటు, గుండెపోటు సమస్యలు అధికం. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ కంటే ఎక్కువ మంది రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. ఈ వ్యాధికి సంబంధించినా నివారణ చర్యలను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం మే 17న ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని జరుపుకుంటారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా ప్రకారం భారతదేశంలో అధిక రక్తపోటుతో బాధపడేవారిలో 12% మంది మాత్రమే రక్తపోటును జయించగలుగుతున్నారు. ఈ సమస్యను నుంచి బయటపడాలి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మారుతున్న జీవనశైలిలో భాగంగానే చాలా మందిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి.
కొందరిలో శారీరక వ్యాయామం లేకపోవడం, ఆహారంలో మార్పులు, సోడియం అధికంగా తీసుకోవడం,జంక్-ఫాస్ట్ ఫుడ్ లాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల సమస్యలు అధికంగా వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. తగు జాగ్రత్తలు తీసుకునీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనీ ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
బరువు నియంత్రించుకుంటే చాలా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. అందులో ముఖ్యంగా రక్తపోటు సమస్య నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు. శరీర బరువు నియంత్రణలో లేకుంటే మాత్రం రక్తపోటు సమస్యతో పాటు, గుండెపోటు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు తెలుపుతున్నారు.
సోడియం చక్కర పరిణామాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోకపోవడం మంచిది. అలా తీసుకోవడం వల్ల సమస్యలు వస్తాయి కాబట్టి సోడియం అతిగా ఉన్న ఆహారాలు తీసుకోకూడదు.