Yubari Fruit : పుచ్చకాయ ఈ పండు గురించి మనందరికీ తెలిసిందే వేసవిలో ఈ పండు మనకు అత్యధికంగా లభిస్తుంది. పుచ్చకాయ మనకు తెలిసి సామాన్యంగా 50 నుంచి 60 రూపాయల లోపే దొరుకుతుంది. కానీ ఒక్కో దేశంలో ఈ పండును ఒక రకంగా వినియోగిస్తూ ఉంటారు. అయితే దీనిని ప్రపంచంలో చాలా రకాల పుచ్చకాయలు పండిస్తారు. వాటిలో అత్యంత ఖరీదైన పండు కూడా ఒకటి ఉంది. దీని ధర వేళల్లో,లక్షల్లో ఉంటుందంటే అతిశయోక్తి కాదు. దాని పేరు యుబారి కింగ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండు ఇది.
ఎక్కువగా జపాన్ లో సాగు చేస్తారు. ఇది జపాన్ మెలోన్ రకం. దీనిని జపాన్ లోని హక్కైడో ద్విపంలో యూభారీ నగరంలో పండిస్తారు. అందుకే దీనికి ఆ పేరు పెట్టారు. అక్కడి ఉష్ణోగ్రతలు ఈ పండును పండించడానికి అనుకూలంగా ఉండటమే దీనికి కారణం. ఈ పండు అంత ఖరీదుగా ఉండడానికి ప్రధాన కారణం ఆ పండులో తీపి రుచి అద్భుతంగా ఉంటుంది. యుబారి నగరంలో ఉష్ణోగ్రతలు రెండు రకాలుగా ఉంటాయి.
పగలు ఉష్ణోగ్రత రాత్రి ఉష్ణోగ్రత చాలా తేడాతో కూడుకొని ఉంటాయి .దాని కారణంగానే ఆ పండు అంత తీయగా ఉంటుందని అందుకే దాని ద్వారా అంత ఎక్కువగా ఉందని నీపుణులు చెబుతున్నారు. ఈ పండు అంత ఖరీదుగా ఉండడానికి కారణం ఏమిటంటే దీనిని మార్కెట్లో విక్రయించరు. దీనిని కేవలం వేలంపాటలో మాత్రమే కొనుక్కోవాల్సి ఉంటుంది బంగారం ధరతో సమానం అంటే ఒకసారి ఆలోచించండి 2022 వ సంవత్సరంలో ఈ పండు ఏకంగా 20 లక్షల రూపాయల వేలంలో అమ్ముడుపోయింది. 2018 లో 18 లక్షలకు అమ్ముడుపోయింది.
దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. దీని వల్ల గుండె సంబంధిత వ్యాధులు నయమవుతాయి. ఈ పండు ఒక యాంటీ ఇన్ఫెక్షన్ ఫ్రూట్. దీన్ని వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పొటాషియంతో పాటు విటమిన్ సి, ఫాస్పరస్, విటమిన్ ఎ, కాల్షియం కూడా ఇందులో లభిస్తాయి. మార్కెట్‌లో దీనికి డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల ప్రపంచంలోని ధనవంతులు మాత్రమే దీనిని తింటారు.