Aishwarya Rajinikanth : నాన్నకి అనవసరమైన బిల్డప్ ఇచ్చాం, అందుకే కథ నాశనం అయింది.. తప్పు ఒప్పేసుకున్న రజనీ కూతురు
సూపర్ స్టార్ రజనీకాంత్ కి తన కుమార్తెలు తెరకెక్కిస్తున్న చిత్రాలు ఏమాత్రం కలసి రావడం లేదు. దాదాపు పదేళ్ల క్రితం రజనీ చిన్న కూతురు భారీ బడ్జెట్ లో తెరకెక్కించిన కొచ్చాడియాన్ చిత్రం ఎంత పెద్ద డిజాస్టర్ గా నిలిచిందో తెలిసిందే. ఇప్పుడు పెద్ద కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ వంతు వచ్చింది. ఆమె దర్శకత్వంలో లాల్ సలాం చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే.
జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రజనీకాంత్ సినిమాకి ఉండాల్సిన మినిమమ్ హైప్ కూడా ఈ చిత్రానికి రాలేదు. విడుదలయ్యాక అయినా పరిస్థితి మారుతుందా అనుకుంటే రజని కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం రిలీజ్ అయ్యాక ఐశ్వర్య రజినీకాంత్ కనీసం బయట కూడా కనిపించలేదు.
ఈ చిత్రానికి ఆమె దర్శకురాలు కావడంతో పరాజయ భారం, నెగిటివ్ కామెంట్స్, విమర్శలు మొత్తం ఆమె భరించాల్సి వచ్చింది. ఎట్టకేలకు లాల్ సలామ్ పరాజయంపై ఐశ్వర్య ఓపెన్ అయింది. తన తప్పుని అంగీకరిస్తూ పరాజయానికి కారణాలు వివరించింది. ముందుగా ఈ చిత్రంలో తన తండ్రి రజనీకాంత్ పాత్రని కేవలం గెస్ట్ రోల్ గా 10 నిముషాలు మాత్రమే అనుకున్నాం.
మేము రాసుకున్న కథ ఫస్ట్ వర్షన్ లో ఇంటర్వెల్ తర్వాత మొయినుద్దీన్ పాత్ర ప్రవేశిస్తుంది. అప్పటి వరకు ఊర్లో ఉండే పత్రాలు, క్రికెట్ తదితర సన్నివేశాలతో సినిమా ఉంటుంది. లెన్త్ ఎక్కువైనా పర్వాలేదు చేస్తాను అని నాన్నగారు చెప్పారు. దీనితో ఆయనకి బిల్డప్ ఇవ్వడం కోసం ఎంట్రీ సీన్, ఫైట్ డిజైన్ చేశాం. ఫలితంగా అసలు కథ సైడ్ ట్రాక్ లోకి వెళ్ళింది. విష్ణు విశాల్ పాత్ర కూడా తగ్గిపోయింది.
రిలీజ్ కి రెండు రోజుల ముందు ఎడిటింగ్ లో కూడా సమస్యలు వచ్చాయి. దీనితో ఫైనల్ అవుట్ పుట్ ని చెక్ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ చిత్రంలో ప్రేక్షకులు, క్రిటిక్స్ ఎత్తి చూపిన లోపాలాన్ని నిజమే. తన తప్పుని అంగీకరిస్తున్నట్లు ఐశ్వర్య రజనీకాంత్ తెలిపారు.