Ajith Kumar Health Update : షాకింగ్..అజిత్ కి బ్రెయిన్ ట్యూమర్ ? అసలు వాస్తవం ఇదే, ఆయనకి ఉన్న ఆరోగ్య సమస్య ఏంటంటే
తమిళ స్టార్ హీరో తలా అజిత్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు అనే వార్తలు రాగానే ఫ్యాన్స్ లో ఆందోళన పెరిగిపోయింది. అజిత్ కి సర్జరీ చేయబోతున్నారు అనే న్యూస్ రాగానే ఫ్యాన్స్ టెన్షన్ అంతా ఇంతా కాదు. అసలు అజిత్ కి ఏమైంది ? ఎందుకు ఆసుపత్రికి వెళ్లారు అంటూ ఆరా తీయడం మొదలు పెట్టారు.
అయితే అజిత్ రెగ్యులర్ చెకప్ కోసమే చెన్నై అపోలో ఆసుపత్రికి వెళ్లినట్లు కొందరు తెలిపారు. కానీ అజిత్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారట. దీనితో ఊహాగానాలు పుకార్లు పెరిగిపోయాయి. అజిత్ బ్రెయిన్ ట్యూమర్ తో భాదపడుతున్నారని.. వైద్యులు సర్జరీ చేసేందుకు రెడీ అవుతున్నట్లు ప్రచారం జరిగింది.

కానీ ఈ పుకార్లని అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర ఖండించారు. అజిత్ కి ఉన్న ఆరోగ్య సమస్యని వివరించారు. అజిత్ సాధారణమైన నరాల వాపుతో బాధపడుతున్నారు. ఇది ఆందోళన కర విషయం కాదు. చెవి నుంచి బ్రెయిన్ కి వెళ్లే నరం వాపు వల్ల అజిత్ ఆసుపత్రిలో చేరారు. దానికి సర్జరీ కూడా అవసరంలేదు. చాలా సింపుల్ ట్రీట్మెంట్. రెండు రోజుల్లో అజిత్ డిశ్చార్జ్ అవుతారు అని సురేష్ చంద్ర తెలిపారు.
ప్రస్తుతం అజిత్.. మిగిల్ తిరుమేని దర్శకత్వంలో ఒక చిత్రంలో నటిస్తున్నారు. అజిత్ కొన్ని రోజుల పాటు చెన్నైలో విశ్రాంతి తీసుకున్న తర్వాత తిరిగి షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.
