Akira Nandan : నాన్న లాగా కొత్త లుక్.. కానీ అమ్మ కోసం ఇలా, అకీరా గురించి రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉన్నారు. అందుకే సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ గురించి చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రెండింగ్ అవుతోంది. అకీరాని అభిమానులు ఆల్రెడీ జూనియర్ పవర్ స్టార్ అంటూ అభివర్ణిస్తున్నారు.
రేణు దేశాయ్ తరచుగా అకీరా విశేషాలని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఆమె చేసిన పోస్ట్ పవన్ ఫ్యాన్స్ ఊపేయడం మాత్రమే కాదు.. అకీరాకి తల్లి మాట పట్ల ఉన్న గౌరవాన్ని కూడా తెలిపేలా ఉంది. అకీరా కాస్త లాంగ్ హెయిర్ తో పవన్ కళ్యాణ్ యంగ్ గా ఉన్నప్పటికి హెయిర్ స్టైల్ తో అదరగొట్టేస్తున్నాడు.

అకీరాని సడెన్ గా చూస్తే అది పవన్ కళ్యాణ్ కదా అని అనిపించక మానదు. అకీరా అంత స్టైలిష్ గా ఉన్నాడు.
ఇక అమ్మకి ఇచ్చిన గౌరవం ఏంటంటారా.. ఈ ఫొటోలో అకీరా ఇయర్ ఫోన్స్ తో మ్యూజిక్ వింటున్నాడు. దీని గురించి రేణు దేశాయ్ పోస్ట్ చేస్తూ.. వైర్ లెస్ హెడ్ ఫోన్స్ వాడడం, బ్లూ టూత్ ఉపయోగించడం చెవులకు, బ్రెయిన్ కి అంత మంచిది కాదు. వైర్ లెస్ వల్ల బ్రెయిన్ కి సమస్యలు రావచ్చు.
వైర్ ఉన్న హెడ్ ఫోన్స్ వాడమని అకీరాకి, ఆద్యకి చెబుతూ వస్తున్నాను. వాళ్ళు నెమ్మదిగా వైర్ ఉన్న హెడ్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది అని రేణు దేశాయ్ పోస్ట్ చేసింది. అంటే అకీరా అమ్మకి గౌరవం ఇస్తూ ఆమె మాటని పాటిస్తున్నాడు.
