• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Movie Articles

Ala Modalaindi Re-Release : వెండితెరపై మళ్ళీ “అలామొదలైంది..” ఈ సినిమా టెర్రిఫిక్ హిట్ వెనుక ఉన్న ఆ మాటల మాంత్రికుడు ఎవరు..??

TrendAndhra by TrendAndhra
February 22, 2023
in Movie Articles
0 0
0
Ala Modalaindi Re-Release : వెండితెరపై మళ్ళీ “అలామొదలైంది..” ఈ సినిమా టెర్రిఫిక్ హిట్ వెనుక ఉన్న ఆ మాటల మాంత్రికుడు ఎవరు..??
Spread the love

Table of Contents

Toggle
  • Ala Modalaindi Re-Release : వెండితెరపై మళ్ళీ “అలామొదలైంది..” ఈ సినిమా టెర్రిఫిక్ హిట్ వెనుక ఉన్న ఆ మాటల మాంత్రికుడు ఎవరు..??
  • అవేంటో ఆయన  మాటల్లోనే..!!

Ala Modalaindi Re-Release : వెండితెరపై మళ్ళీ “అలామొదలైంది..” ఈ సినిమా టెర్రిఫిక్ హిట్ వెనుక ఉన్న ఆ మాటల మాంత్రికుడు ఎవరు..??

నేచురల్ స్టార్ నాని హీరోగా వెండితెరకి పరిచయం అయిన మొదటి సినిమా అష్టా చమ్మా. మొదటి సినిమానే అయినా తన నటనతో తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకున్నారు.. ఇక ఆ తరువాత వచ్చిన సినిమా అలా మొదలైంది ఇందులో నాని నటించిన తీరు అద్భుతం.. పక్కింటి కుర్రాడిలా చాలా సహజ సిద్ధంగా నటించి గొప్ప విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా ఒకరకంగా నాని ని తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా చేసింది అనే చెప్పొచ్చు. కేవలం రెండో సినిమాతోనే నాని కనబరచిన నటనకి నేచురల్ స్టార్ అనే బిరుదు ఇచ్చింది ప్రేక్షక లోకం… ఎన్ని సార్లు చూసినా బోర్ అనేదే రాని సినిమాల్లో ఇదొకటిగా నిలిచింది. అప్పుడప్పుడూ టీవీ ల్లో ప్రసారం అవుతూ మంచి రేటింగ్ కూడా సొంతం చేసుకుంటుండడం విశేషం.

Ala Modalaindi Re-Release

అయితే తాజాగా ఈ “అలా మొదలైంది” సినిమా వెండితెరపై ఈ నెల 22న మళ్ళీ మొదలవబోతుందని నిర్మాతలు ప్రకటించడం తో అభిమానులు మళ్ళీ ఇంకోసారి థియేటర్ లో సందడి చేయడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

చిత్ర విడుదల సందర్భంగా .. “అలా మొదలైంది” సినిమాకి అద్భుతమైన మాటలు అందించి చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించిన మాటల రచయిత లక్ష్మీ భూపాల ఈ సినిమా ప్రయాణంలో తనకి ఎదురైన అనుభవాలని.. అభిప్రాయాలని ప్రేక్షకులతో పంచుకున్నారు.

అవేంటో ఆయన  మాటల్లోనే..!!

“2010 లో….. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 7లో Mocha అనే రెస్టారెంట్ ఉండేది.. ఒక కొత్త డైరెక్టర్ కథ చెప్తానంటే వెళ్లి కలిశాను.. అక్కడ వాతావరణం చూసి ఇదేదో మనది కాని ఏరియా అనిపించింది.. (నాకు ఇప్పటికీ ఖరీదైన రెస్టారెంట్స్ కాస్త ఇబ్బందిగానే ఉంటాయ్.. బహుశా మధ్యతరగతి మనస్తత్వం వల్ల కావచ్చు).. కాసేపటికి ఆ కొత్త డైరెక్టర్ నందిని రెడ్డి వచ్చి కథ చెప్పింది.. బాగా క్లాస్ గా ఉంది.. ఐడియా బాగుంది కానీ ఏదో మిస్సింగ్ ఫీలింగ్.. సరే రాసేటప్పుడు చూద్దాం అనుకున్నా..

హీరో ఎవరంటే అష్టా చెమ్మా సినిమాలో చేసిన కొత్తబ్బాయ్ నాని అని చెప్పింది.. హీరోయిన్ నిత్యా మీనన్ అని ఇంకో కొత్తమ్మాయి అంది.. డైరెక్టర్ కూడా కొత్త, మొదటి సినిమా… సంగీతం కల్యాణి మాలిక్ అన్నారు.. ఐతే సినిమా వల్ల ఆయనంటే ఒక నమ్మకం.. ఈ కొత్తోళ్ళ సంగతి మనకు సరిగా తెలీదు.. చూద్దాం ఏం జరుగుతుందో అనుకున్నా..

తర్వాత నందిని నన్ను తీసుకెళ్ళి ప్రొడ్యూసర్ దాము గారిని కలిపించింది.. ఆయన ఒకప్పటి నిర్మాత రంజిత్ కుమార్ గారబ్బాయి.. ఆయన పేరు మీదే రంజిత్ మూవీస్ మొదలుపెట్టారు.. పాతికేళ్ల తర్వాత రంజిత్ గారి వారసత్వాన్ని కొనసాగిస్తూ మొదలైన సినిమా ఇది.. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వివేక్ కూచిభొట్ల గారు.. క్రియేటివ్ సూపరవైజర్ లాంటి పోస్టులో దర్శకులు ఉప్పలపాటి నారాయణరావు గారు ఉన్నారు..

Ala Modalaindi Re-Release

బేరసారాలు అయ్యాయి..
క్లైమాక్స్ తప్ప మొత్తం రాసేసా.. ఇంకా ఆ ఏదో మిస్సింగ్ ఫీలింగ్ అలాగే ఉంది..

అయినంతవరకు ఎడిటింగ్ చేసుకుని చూసాం.. దాము గారు కూడా కొంతమంది శ్రేయోభిలాషులైన దర్శకులకు చూపించారు.. అందరూ పెదవి విరిచారు.. ఒక డైరెక్టర్ అయితే తీసింది మొత్తం కాల్చేయమన్నాడు.. నందిని రెడ్డి మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉంది.. దాము గారు కూడా పంతం వదల్లేదు.. ఇది తప్పు జరిగే సినిమా కాదని నమ్మారు.. నేను కూడా అయోమయంలో పడ్డాను..

ఫలితంగా సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరగకుండా కొన్ని నెలలు ఆగిపోయింది..

తీవ్రమైన చర్చలు.. కథ పైన కసరత్తులు చేశాం.. అప్పుడు ఆశిష్ విద్యార్థి ట్రాక్ పుట్టింది.. అందరికీ ఉత్సాహం పెరిగింది.. నేను రాస్తూ ఉండగా క్లైమాక్స్ లో ఏదో మేజిక్ చెయ్యాలని అనిపించింది.. ఎవరికీ చెప్పకుండా తాగుబోతు రమేష్ పాత్రని పుట్టించి పెట్టేసాను.. నిజానికి కథలో అలా అకస్మాత్తుగా ఒక పాత్ర ఆఖర్లో రావడం అప్పటివరకు సినిమాల్లో జరగలేదు.. అది సినిమా కథ రూల్స్ కి వ్యతిరేకం అట.. నేను సాధారణ ప్రేక్షకుడి నుంచి ప్రమాదవశాత్తూ రచయితగా మారడం నాకు అవేవీ తెలీదు.. అదృష్టవశాత్తు నా ప్రయోగం అందరికీ నచ్చింది.. (ఆ తర్వాత చాలా సినిమాల్లో అదే ఫార్ములా వాడారనుకోండి..)

ఎన్నో తంటాలు పడి సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది.. చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ సినిమా ప్రివ్యూ చూసి వెనకడుగు వేశారు.. దాము గారు కొంత అమ్మి, మిగిలిన ఏరియాల్లో ధైర్యంగా విడుదల చేశారు….

ఫలితం…….
అలా మొదలైంది.. ఒక ట్రెండ్ సెట్టర్.. కొత్త నటులు స్టార్స్ అయ్యారు.. మా చెల్లాయ్ నందిని రెడ్డి స్టార్ దర్శకురాలు అయ్యింది..
నాకు రచయితగా ప్రత్యేక గుర్తింపు వచ్చింది..
కల్యాణి మాలిక్ గారి పాటలు సూపర్ హిట్స్.. అందులో ” ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది” పాట కూడా రాశాను, మాటలతో పాటూ.. తాగుబోతు రమేష్ అనే చిన్న నటుడు పెద్ద కమెడియన్ అయ్యాడు..ఇదంతా కేవలం మీ అందరి ఆదరణ వల్ల…

ఒక పుష్కర కాలం తర్వాత ఇప్పుడు మళ్లీ ఫిబ్రవరి 24న, కొత్తబ్బాయి నాని నుండి స్టార్ హీరోగా ఎదిగిన నాని పుట్టినరోజు సందర్భంగా విడుదల చేస్తన్నారు అని తెలిసి అవన్నీ గుర్తుకొచ్చాయి..వీలుంటే వెళ్లి మళ్ళీ థియేటర్లో చూడండి.. అప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకోండి” అంటూ చెప్పుకొచ్చారు


Spread the love
Tags: AlamodalaindiLakshmiBhupalaManofmassesramcharanNaniPawanKalyanPKSDTTelugu
Please login to join discussion
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.