Ananya Nagalla Lip Kiss : లిప్ కిస్సులకు ఒప్పుకోకూడదు అనుకున్నా, కానీ ఆ తర్వాత అర్థమైంది.. అనన్య నాగళ్ళ బోల్డ్ కామెంట్స్
వకీల్ సాబ్, మల్లేశం లాంటి చిత్రాలతో నటిగా గుర్తింపు తెచ్చుకుంది తెలుగు బ్యూటీ అనన్య నాగళ్ళ. ప్రతి చిత్రంలో తన నటనా ప్రతిభ చూపించే పాత్రలే అనన్యకి దక్కాయి. కానీ సోషల్ మీడియాలో అనన్య నాగళ్ళ గ్లామర్ కి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు. ఆమె గ్లామర్ ఫోటోస్ పోస్ట్ చేసే క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం అనన్య నాగళ్ళ తంత్ర అనే చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ మార్చి 15న రిలీజ్ కి రెడీ అవుతోంది. హారర్ అంశాలతో ఈ చిత్రం థియేటర్స్ లోకి రాబోతోంది. అదే విధంగా అనన్య పొట్టేలు అనే చిత్రంలో కూడా నటిస్తోంది. తంత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా అనన్య కి బోల్డ్ సీన్స్, లిప్ కిస్సుల గురించి ప్రశ్న ఎదురైంది.
పొట్టేలు చిత్రంలో అనన్య ఘాటైన లిప్ లాక్ సీన్ లో రెచ్చిపోయింది. దీని గురించి ఇంటర్వ్యూలో అనన్యకి ప్రశ్న ఎదురైంది. ఆ చిత్రంలో లిప్ లాక్ సీన్ చాలా అవసరం. అందుకే నటించాల్సి వచ్చింది. దాని గురించి ఆ చిత్రం రిలీజ్ అయ్యే ముందు వివరిస్తా అని పేర్కొంది.
అయితే కెరీర్ బిగినింగ్ లో అనన్య నాగళ్ళ.. తాను నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తానని.. ముద్దు సన్నివేశాలు, బోల్డ్ సీన్స్ కి తాను అంగీకరించనని తేల్చి చెప్పేసింది. మరి ఇప్పుడు ముద్దు సీన్ లో నటించారు కదా అని ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. అవునా అప్పుడు అలా చెప్పానా అంటూ నవ్వేసింది.
అందుకు వివరణ కూడా ఇచ్చింది. కెరీర్ బిగినింగ్ లో నాకు అంత మెచ్యూరిటీ లేదు. మంచి పత్రాలు మాత్రమే చేయాలనుకున్నా. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించాలనుకున్నా పెర్ఫామెన్స్ కి అవకాశం ఉన్న పాత్రలు దొరికితే బావుంటుందని భావించేదాన్ని.
కానీ మెచ్యూరిటీ వచ్చాక అర్థం అయింది.. కథను అనుగుణంగా బోల్డ్ సన్నివేశాల్లో నటించి మెప్పించడం కూడా పెర్ఫామెన్స్ లో భాగమే అని తెలుసుకున్నా. ప్రతి 6 నెలలకి మనిషి ఎదిగే క్రమంలో అభిప్రాయాలు మారుతుంటాయి. నేను కూడా అంతే. అప్పట్లో మెచ్యూరిటీ లేకపోవడం వల్లే బోల్డ్ సీన్స్ లో నటించనని చెప్పా. కానీ ఇప్పుడు పాత్ర నచ్చితే ఎలాగైనా నటిస్తానని అనన్య తెలిపింది.