Anshu Ambani : ప్రభాస్, నాగార్జున చిత్రాలపై కోపం.. మన్మథుడు హీరోయిన్ అందుకే సినిమాలు మానేసిందట
మన్మథుడు చిత్రంలో నటించిన హీరోయిన్ అన్షు అంబానీ మరచిపోలేని ముద్ర వేసింది. ఆ చిత్రంలో ఆమె లుక్స్ అచ్చ తెలుగు అమ్మాయిలాగే ఉంటాయి. అమాయకమైన చూపులతో మెస్మరైజ్ చేసింది. ఆ చిత్రం చేసే సమయంలో అన్షు వయసు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. ఆ మూవీ టైంలో అన్షు వయసు కేవలం 16. టీనేజ్ లోనే ఆమె సక్సెస్ కొట్టింది.
ఆ తర్వాత అన్షు ప్రభాస్ రాఘవేంద్ర చిత్రంలో నటించింది. విచిత్రంగా ఈ రెండు చిత్రాల్లో అన్షు అంబానీ చనిపోయే పాత్రలే చేసింది. రాఘవేంద్ర చిత్రం కూడా మంచి విజయం సాధించింది. దీనితో అన్షుకి టాలీవుడ్ లో మంచి భవిష్యత్తు ఉంటుందని అనుకున్నారు. కానీ వెంటనే ఆమె కెరీర్ ముగిసిపోయింది.

పెళ్లి చేసుకుని ఫారెన్ లో సెటిల్ అయిపోయింది. 20 ఏళ్ళ తర్వాత అన్షు అంబానీ మీడియా ముందుకు వచ్చింది. ఓ ఇంటర్వ్యూలో తాను సినిమాలు మానేయడానికి కారణాలు వివరిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వాస్తవానికి అన్షు సినిమాలు కొనసాగించాలని అనుకుందట.
కానీ మన్మథుడు, రాఘవేంద్ర తర్వాత కూడా తనకు మరణించే పాత్రలే ఆఫర్ చేశారట. రెండు చిత్రాల్లో బాగా నటించాను కదా అని నన్నుఅదే తరహా పాత్రలకు పరిమితం చేయాలని చూశారు. అందుకే చిరాకు పుట్టింది. ఒకే తరహా పాత్రలు చేయడం కంటే సినిమాలకు దూరం కావడం మంచిది అనిపించిందని అన్షు పేర్కొంది. అందుకే నటనకి టాటా చెప్పేసిందట.
అన్షు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అన్షు అంబానీ ఇంగ్లాండ్ లో పుట్టి పెరిగిన అమ్మాయి. వారి కుటుంబీకులు ఇండియాకి చెందిన వారు. ఆ విధంగా అన్షు ఇండియాకి వచ్చి ఇక్కడ చిత్రాల్లో నటించింది.
