సోషల్ మీడియా మొత్తం అనుపమ జపమే.. ఈసారైనా ముద్దు సీన్లు హిట్ ఇస్తాయా ?
సోషల్ మీడియా మొత్తం అనుపమ పరమేశ్వరన్ నామ స్మరణతో నిండిపోయింది. వామ్మో అది మామూలు ట్రాన్స్ ఫర్మేషన్ కాదని యువత ఆశ్చర్యపోతున్నారు. ప్రేమమ్, అ..ఆ చిత్రాల్లో చూసిన అనుపమనేనా ఇప్పుడు చోస్తోంది అంటూ ముక్కున వేలేసుకోవడం ప్రేక్షకుల వంతు అవుతోంది.
నిన్న విడుదలైన టిల్లు స్క్వేర్ ట్రైలర్ లో అనుపమ చేసిన రొమాన్స్ రచ్చ అలా ఉంది మరి. సిద్దు జొన్నలగడ్డతో కలసి అనుపమ లిప్ లాక్ సీన్స్ లో రెచ్చిపోయింది. ప్రతి సీన్ లో అనుపమ బోల్డ్ గా కనిపిస్తూ శృంగారం గురించే డైలాగులు చెబుతోంది. అనుపమ గతంలో హోమ్లీ గా కనిపించి అనేక విజయాలు సొంతం చేసుకుంది.
రౌడీ బాయ్స్ చిత్రంతో తొలిసారి అనుపమ బోల్డ్ గా పెర్ఫామ్ చేసింది. ఆశిష్ రెడ్డితో కలసి ఆ చిత్రంలో లిప్ లాక్ సీన్స్, శృంగార సన్నివేశాలు చేసింది. అయితే రౌడీ బాయ్స్ హిట్ కాలేదు. ఆ చిత్రంలో అనుపమ బోల్డ్ అప్పియరెన్స్ కూడా ప్రేక్షకులకి అంతగా నచ్చలేదు. అప్పటి వరకు హోమ్లీగా చూసిన అనుపమని అలా రొమాన్స్ సన్నివేశాల్లో చూడడం కొందరు ప్రేక్షకులకు ఇబ్బందిగా అనిపించింది.
కానీటిల్లు స్క్వేర్ లో ఒక్కసారిగా అనుపమ రొమాన్స్ డోస్ పెంచేసినట్లు ఉంది. ట్రైలర్ లోనే ఇలా ఉంటే ఇక సినిమాలో ఇంకెత రచ్చ ఉందో మరి అని నెటిజన్లు షాక్ అవుతున్నారు. అయితే టిల్లు స్క్వేర్ విషయంలో ముందు నుంచి ఆడియన్స్ ని ప్రిపేర్ చేస్తూ వస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమ బోల్డ్ గా కనిపించ బోతున్నట్లు పోస్టర్స్ ద్వారా హింట్స్ ఇస్తూనే ఉన్నారు.
ఏది ఏమైనా టిల్లు స్క్వేర్ చిత్రం అనుపమకి సెకండ్ ఇన్నింగ్స్ లాటింది అని చెప్పొచ్చు. మరి ఈసారైనా ముద్దు సన్నివేశాలు ఆమెకి విజయాన్ని అందిస్తాయో లేదో చూడాలి.