Balakrishna Remuneration: నట సింహం నందమూరి బాలకృష్ణకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. బాలయ్య నటించిన సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుంది. మాస్ ప్రేక్షకులు మెచ్చే సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నారు. పైగా ఇటీవల అన్ స్టాపబుల్ షోలో హోస్ట్ కూడా ఆదరగొట్టారు.
బోయపాటి దర్శకత్వంలో వచ్చిన అఖండ ఘన విజయం తర్వాత ఈ సంక్రాంతికి వచ్చిన వీరసింహారెడ్డితో బాలయ్య వరుస విజయాలు సొంతం చేసుకున్నారు. దీంతో బాలయ్య రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో రెమ్యూ నరేషన్ కూడా భారీ గా పెరిగిపోయింది. ప్రస్తుతం బాలయ్య ఒక్కో మూవీకి 20 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్.
బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో NBK108 చేస్తున్నారు. ఆ తర్వాత కూడా పూరీ డైరెక్షన్ ఓ సినిమా కన్ఫామ్ అయినట్లు తెలుస్తుంది. అలాగే క్రిష్, బోయపాటి కూడా లైన్ లో ఉన్నారట. అంతేకాదు.. యంగ్ డైరెక్టర్స్ ప్రశాంత్ వర్మ, వెంకటేశ్ మహా చెప్పిన స్టోరీ లైన్స్ కూడా బాలయ్యకు బాగా నచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా NBK 109 ఓ కొత్త డైరెక్టర్ తో ప్లాన్ చేశారట.
స్టోరీ డిస్కషన్ లో ఉండగా ఓ ప్రాబ్లమ్ వచ్చిందట. ఈ సినిమా కు బాలయ్య రూ.20కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుండగా ఆ డైరెక్టర్ కూడా తనకు రూ.10కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. కానీ ప్రొడ్యూసర్.. కేవలం రూ.2 కోట్లు మాత్రమే ఇస్తానని అలాగే నాన్ థియేట్రికల్ లాభాల్లో 20 శాతం షేర్ ఇస్తానని అన్నట్టు సమాచారం. దీనికి ఆ యువ దర్శకుడు అంగీకరించట్లేదట.