Balakrishna vs Jr NTR : ఎన్నికల ముందు బాబాయ్ పై పోటీకి దిగుతున్న ఎన్టీఆర్.. ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం ?
ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. పాత చిత్రాలన్నింటిని ఇప్పుడు రీ రిలీజ్ చేసేస్తున్నారు. కొన్ని ఫ్లాప్ చిత్రాలు కూడా రిరిలీజ్ లో సత్తా చాటుతున్నాయి. నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ చిత్రాల్లో సమరసింహారెడ్డి ఒకటి. బాలయ్య క్రేజ్ ని మరో స్థాయికి తీసుకెళ్లిన చిత్రం అది.
OG నుండి క్రేజీ అప్డేట్ మీకోసం..
బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కనీవినీ ఎరుగని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రంతో బాలయ్య సీమ కథతో వచ్చిన చిత్రాలకు బ్రాండ్ గా మారిపోయారు. ఈ చిత్రాన్ని మార్చి 2న రీరిలీజ్ చేస్తున్నారు. సమరసింహారెడ్డి లాంటి మాస్ చిత్రం వెండితెరపై మరోసారి ప్రత్యక్షం అవుతుంటే అభిమానుల సంతోషానికి అవధులు ఉండవు అని చెప్పడంలో సందేహం లేదు.

Balakrishna vs Jr NTR : Simhadri Re Release Date
అయితే మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆల్ టైం బ్లాక్ బస్టర్ సింహాద్రి చిత్రం సమరసింహారెడ్డికి పోటీగా దిగుతోంది. బాబాయ్ చిత్రానికి ఒక రోజు ముందు అబ్బాయి సినిమా రీరిలీజ్ అవుతోంది. అసలే ఎన్టీఆర్, బాలకృష్ణ మధ్య అంతగా సఖ్యత లేదనే ప్రచారం జరుగుతోంది.

Jr NTR vs Telugudesam
ఎన్టీఆర్ ని నందమూరి కుటుంబ సభ్యులు ఫ్యామిలీకి, తెలుగుదేశం పార్టీకి దూరం పెడుతున్నారనే వాదన చాలా రోజులుగా ఉంది. ఆల్రెడీ ఏపీలో ఎలెక్షన్ హీట్ మొదలైపోయింది. ఇలాంటి తరుణంలో ఆ రెండు చిత్రాలు రీరిలీజ్ అయితే అభిమానుల మధ్య చిచ్చు మొదలైనట్లే అని అంటున్నారు. ఫాన్స్ వార్ సృష్టించడం కోసం కొందరు ఈ చిత్రాలని రీ రిలీజ్ చేస్తున్నారా అనే ప్రచారం కూడా జరుగుతోంది.