Balayya Akhanda 2 Story : నటసింహం నందమూరి బాలకృష్ణకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. మాస్ ప్రేక్షకులు మెచ్చే సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నారు. బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్ లో గతంలో వచ్చిన సింహా, లెజెండ్ తర్వాత వచ్చిన హ్యాట్రిక్ మూవీ అఖండ. సినిమా రిలీజ్ కి ముందే జై బాలయ్య పాట హిట్ కావడం, ట్రైలర్ లో కూడా బాలయ్య మార్కు ఉండడంతో అందరికీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు దగ్గట్టే అందరి అంచనాలను మూవీ రీచ్ అయ్యింది.
థమన్ బాక్గ్రౌండ్ స్కోర్ మూవీకి హైలెట్ గా నిలిచింది. అఖండ లో శివుడ్ని, శివ భక్తితో పాటు బాలయ్య నట విశ్వరూపాన్ని చూపించి అఖండ విజయం అందుకున్నారు. అయితే గతకొన్ని రోజులుగా అఖండ2 పై చర్చ నడుస్తుంది. బాలయ్య అఖండ2 ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అఖండ2 కథ పై ఓ ఆసక్తికరమైన గాసిప్ వినిపిస్తోంది. ఓ స్వార్థపరుడి చేతిలో పడి నాశనం అవుతున్న ప్రజలను, ముఖ్యంగా తిరుమలేశుని ప్రతిష్టను తగ్గించే కార్యక్రమాలు చేసే వ్యక్తులను హీరో అంతం చేస్తాడట.
అలాగే ఇతర మతస్తుడు నాయకుడు కావడం కారణంగా దేవాలయాలపై ఎలాంటి దాడులు జరుగుతాయి? వాటిని అరికట్టాలనే అంశాలను అఖండ2 లో చూపించనున్నారట. మొత్తానికి అఖండ2 లో రాజకీయ అంశాలే ప్రధానం కానున్నాయన్న మాట. అఖండ భారీ హిట్ అవ్వడంతో అఖండ 2పై అంచనాలు రెట్టింపయ్యాయి. జూన్ 10న బాలయ్య బర్త్ డే సందర్భంగా అఖండ 2 ని అధికారికంగా ప్రకటించనున్నారు.