ఛీ ఛీ.. జబర్దస్త్ నటిపై ఇలాంటి బూతులా.. బరితెగించిన కమెడియన్
జబర్దస్త్ షో ద్వారా లేడీ కమెడియన్లు కూడా బాగా పాపులర్ అవుతున్నారు. రీతూ చౌదరి, ఫైమా, రోహిణి వీళ్లంతా జబర్దస్త్ తో పాపులారిటీ సొంతం చేసుకున్న వాళ్లే. వీరితో పాటు జబర్దస్త్ సత్య శ్రీ కూడా క్రేజ్ తెచ్చుకుంటోంది. కొందరికి సినిమాల్లో సైతం అవకాశాలు వస్తున్నాయి. సత్య అయితే జబర్దస్త్ షోతో పాటు అప్పుడప్పుడూ సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరుస్తోంది.
రీసెంట్ గా సత్య.. హీరో నితిన్ ఎక్స్ట్రా చిత్రంలో నా పెట్టె తాళం అనే స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సాంగ్ చేస్తున్నానని ఆమెకి కేవలం ముందురోజు మాత్రమే తెలిసిందట. ఈ సాంగ్ లో నటించడం ఆమెకి అసలు ఇష్టం లేదు. ఆడియన్స్ తనని తప్పుగా రిసీవ్ చేసుకుంటారేమో అని భయపడింది. కానీ నితిన్, డైరెక్టర్ వక్కంతం వంశీ ధైర్యం చెప్పడంతో చేసింది.
రీసెంట్ గా ఎక్స్ట్రా జబర్దస్త్ షోలో బుల్లెట్ భాస్కర్ సత్యపై చేసిన కామెంట్స్ వివాదం అయ్యేలా ఉన్నాయి. స్కిట్ లో భాగంగా బుల్లెట్ భాస్కర్ సత్యని గుద్దుతాడు. చూసుకోవా అని సత్య తిడుతుంది. భాస్కర్ బదులిస్తూ రాత్రే యూట్యూబ్ లో మొత్తం చూసేశా అంటాడు. ఏం చూసావు అని అడిగితే.. నా పెట్టె తాళం పాట పడతాడు. దీనితో సత్య సిగ్గుపడుతూ ముఖం దాచేసుకుంటుంది.
ఆ తర్వాత భాస్కర్ బూతు డైలాగులతో రెచ్చిపోయాడు. డబుల్ మీనింగ్ అర్థం వచ్చేలా.. నా దగ్గర కూడా చాలా తాళాలు ఉన్నాయి అని సత్యని చూస్తూ అంటాడు. దీనితో సత్య ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్ అయిపోతుంది. అందరి ముందు ఒక నటిని ఇలా డబుల్ మీనింగ్ డైలాగులతో ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని నెటిజన్లు అంటున్నారు. కామెడీ పంచ్ లకు కూడా ఒక హద్దు ఉంటుంది. మరీ ఇంత దారుణంగా కామెడీ చేయడం కరెక్ట్ కాదని బుల్లెట్ భాస్కర్ పై విరుచుకుపడుతున్నారు.
