Chiranjeevi Risky Action Sequence :
స్వయం కృషి.. ఈ పేరు వినగానే మొదట గుర్తుకు వచ్చే వ్యక్తి “శివ శంకర వర ప్రసాద్”. సినిమా అంటే ఆయన, ఆయన అంటే సినిమా. ఈ తరానికి, అందులోనూ తెలుగువారికి అతను ఒక స్ఫూర్తి. కఠోర తపస్సు చేసిన చిరంజీవుడు. తెలుగు సినిమాలో అతను అధ్యాయం కాదు డిక్షనరీ. తెలుగు సినిమా చిరంజీవికి ముందు, చిరంజీవికి తరవాత అని చెప్పుకునేలా మారిపోయింది.
తనలో ప్రావీణ్యం, సహనం నమ్ముకుని ఆ కళామాతల్లి ఒడిలో జగదేక వీరుడయ్యాడు. కానీ ఆ స్థాయికి చేరడానికి చేసిన జర్నీ మాత్రం సాధారణమైంది కాదు. 1983లో విడుదలైన ఖైదీ చిరంజీవికి భారీ స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి తెరకెక్కించిన ఆ చిత్రం చిరంజీవిని స్టార్ ని చేసింది. గుండా, ఛాలెంజ్, కొండవీటి రాజా, రాక్షసుడు వంటి చిత్రాలతో చిరంజీవి తిరుగులేని స్టార్ గా ఎదిగాడు.
అయితే 1984 లో ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో గుండా చిత్రం విడుదలైంది. ఇందులో చిరంజీవి, రాధ ముఖ్యపాత్రలు పోషించారు. గుండా మూవీలో క్లైమాక్స్ ఎంత భయంకరంగా చిత్రీకరించారో మనకు తెలిసిందే. 20 కిమీ వేగంగా నడుస్తున్న గూడ్స్ కింద భాగంలో హీరో పాకుతూ డైనమేట్స్ తీస్తాడు. మాములుగా ట్రైన్ వస్తేనే భయపడి మనం పక్కకు తప్పుకుంటాం అలాంటిది వెళ్తున్న ట్రైన్ కింద పాకడం,
దూకడంలాంటివి సాధ్యమయ్యే పనులా? డూప్ ని పెట్టినా అతను కూడా ఈ పని చేయలేడు. కానీ దాన్ని సాధ్యమయ్యేలా చేసాడు మెగాస్టార్ చిరంజీవి. అలా మెగాస్టార్ రైలు కింద దూరుతుంటే.. నిర్మాత మిద్దే రామారావు వద్దని ఎంతో బతిమాలారట. అప్పుడు చిరంజీవి “ముందు మీరు ఇక్కడ నుంచి వెళ్లిపోండి..
అస్సలు మీరు ఇక్కడకు రానవసరం లేదు. నాకు తెలుసు.. ఇది చేయగలనో లేదో.. మీకు ఇష్టం లేకపోతే మీరు వెళ్లిపోండి అన్నాడట”. దీంతో ఆ నిర్మాత చేసేదేం లేక సైలెంట్ గా ఉండిపోయాడట. బహుశా ఇలాంటి సాహసాలు అప్పుడు ఇప్పుడు ఒక్క మెగాస్టార్ చిరంజీవికే సాధ్యమయ్యాయి. అందుకే మెగాస్టార్ రీల్ హీరో మాత్రమే కాదు రియల్ హీరో కూడా..