Chiru vs Balayya: టాలీవుడ్ లో సీనియర్ టాప్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒక్కరు స్వయంకృషితో స్టార్ హీరోగా రాణిస్తుండగా, మరొకరు తండ్రి నట వారసత్వాన్ని పునికిపుచ్చుకొని అగ్ర హీరోగా కొనగుతున్నాడు. అయితే వీరిద్దరూ కొన్ని దశాబ్దాలుగా అటు ఫ్యామిలీ, ఇటు మాస్ ఆడియన్స్ ని అలరిస్తున్నారు.
దీంతో కొన్నికోట్ల అభిమానులను సంపాదించుకున్నారు. ఇదిలావుండగా అనేకసార్లు బాక్స్ ఆఫీస్ వద్ద వీరిద్దరూ పోటీపడిన విషయం తెలిసిందే. సంక్రాంతి బరిలో వీరు ఎనిమిదిసార్లు పోటీ పడగా, ఐదుసార్లు మిగతా రోజుల్లో పోటీ పడినట్లు తెలుస్తోంది. మళ్లీ ఐదు సంవత్సరాల తర్వాత ఈ సంక్రాంతి సందర్భంగా చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలతో పోటీపడ్డారు.
వసూళ్ల పరంగా ఇద్దరి సినిమాలు బాగానే వసూలు చేసినప్పటికీ బాలయ్య వీరసింహారెడ్డి సినిమాతో పోలిస్తే చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా ముందంజలో ఉంది అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు మళ్లీ చిరు వర్సెస్ బాలయ్య పోటీని మనం చూడబోతున్నాము అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మెగా అభిమానులు మరియు నందమూరి అభిమానుల మధ్య మళ్ళీ యుద్ధం జరగడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ స్టార్ హీరోలు బాక్సాఫీస్ వద్ద ఎన్నిసార్లు పోటీపడిన బయట ఆత్మీయంగానే ఉంటారు. బాలయ్య నెక్స్ట్ మూవీ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నటిస్తుండగా శ్రీలీల బాలకృష్ణ కుమార్తెగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
చిరు నెక్స్ట్ మూవీ మెహర్ రమేష్ దర్శకత్వంలో
భోలా శంకర్ లో నటిస్తుండగా.. చిరంజీవి సోదరి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుంది. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి, మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సమ్మర్ లో విడుదల కానున్న ఈ రెండు సినిమాల్లో ఎవరిది పై చేయి అవుతుందనేది.. సంక్రాంతి పోటీ తర్వాత మరింత ఆసక్తిగా మారింది. చూడాలి ఈసారి ఎవరు బాక్సాఫీస్ కింగ్ అవుతారో..