Trivikram: ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి డైరెక్షన్ లో వస్తున్న ద్విభాషా చిత్రం “సార్”. ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగులో కూడా నిర్మించారు. ఈ మూవీ ఈ నెల 17 న వరల్డ్ వైడ్ గా విడుదలవుతుండగా టాలీవుడ్ లో విడుదలకు ముందే లాభాలు వచ్చాయని సమాచారం. ఇందులో ధనుష్ కి జోడిగా భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ నటించింది.
చదువు, దాని గొప్పదనం తెలిపే నేపధ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. సితార ఎంటర్టైన్మెంట్ అండ్ త్రివిక్రమ్ సొంత బ్యానర్ అయినా ఫార్చ్యున్ ఫోర్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించగా ఈ సినిమాకు త్రివిక్రమ్ డైలాగ్స్ రాసాడని టాక్. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని బుధవారం హైదరాబాద్ లోని పీపుల్ ప్లాజాలో సినీ ప్రముఖులు, అభిమానుల మధ్య గ్రాండ్ గా నిర్వహించారు.
ఈ ఈవెంట్ కి స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ.. “గోవిందుడు, గురువు ఎదురైతే మొదటి నమస్కారం నేను ఎవరికి పెట్టాలంటే.. గోవిందుడు వీడు అని చెప్పిన గురువుకే నా మొదటి నమస్కారం పెడతానని కబీర్ అన్నాడు. అలాంటి ఎంతోమంది గురువులకి నమస్కారం చెబుతూ.. అలాంటి గురువుల గురించి సినిమా తీసిన వెంకీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అన్నాడు త్రివిక్రమ్.
ఇది 2000లో జరిగిన కథగా చెప్పారు కానీ ఇప్పటికి కూడా సరిగ్గా సరిపోతుంది. టీచర్, స్టూడెంట్ కి మధ్య ఉండే రిలేషన్ చాలా పవిత్రమైనది. మనం ఎంత దూరం ప్రయాణం చేసినా కూడా మన గురువులు మనతో పాటే ఉంటారు. అలాగే ఈ సార్ సినిమా కూడా మనతో పాటు చాలాకాలం పాటు ప్రయాణించే సినిమా అవుతుంది అన్నారు.
కథను నమ్మి ఈ సినిమాను చేసిన హీరో ధనుష్ ను త్రివిక్రమ్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ తరం గొప్ప నటుల్లో ధనుష్ ముందు వరుసలో ఉంటాడు. ఆయన జయాపజయాలను పట్టించుకోకుండా వరుస సినిమాలు చేస్తూ పనిని ఎంజాయ్ చేస్తారు. రిజల్ట్ ని అస్సలు పట్టించుకోడు. ఒకరమైన కర్మయోగి ధనుష్.. అలా పనిని ఎంజాయ్ చేసేవాళ్ళని ఎవరూ ఆపలేరు అంటూ ప్రశంసించారు. ఫైనల్ గా మూవీ టీం కి ఆల్ ది బెస్ట్ చెప్తూ ముగించారు.