Hari Hara Veeramallu Review : పవన్ కళ్యాణ్ తొలి పిరియాడిక్ చిత్రం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో తొలిసారి నటించిన పిరియాడిక్ చిత్రం హరిహర వీరమల్లు. చారిత్రక వీరుడి పాత్రలో పవన్ కళ్యాణ్ గతంలో ఎప్పుడూ నటించలేదు. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈ చిత్రం ఐదేళ్లుగా ఆలస్యం అవుతూ రావడం, ఎట్టకేలకు ఈనెల 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ ఈ చిత్రానికి దర్శకులు. ఇటీవల విడుదలైన హరిహర వీరమల్లు ట్రైలర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా రెట్టింపు చేసేసింది. ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ ఫైరీ లుక్, గ్రాండ్ గా చూపించిన విజువల్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తున్నాయి.
హరిహర వీరమల్లు సెన్సార్ పూర్తి
మరికొన్ని రోజుల్లో ఈ చిత్రం రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మరో కీలక కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంది. హరిహర వీరమల్లు సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు యూఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఆశ్చర్యకరంగా సెన్సార్ సభ్యులు ఈ చిత్రంలో ఒక్క కట్ కూడా చెప్పలేదట.
మూవీ రన్ టైం రెండు గంటల 42 నిమిషాలుగా లాక్ అయినట్లు తెలుస్తోంది. సెన్సార్ సభ్యుల నుంచి హరిహర వీరమల్లు చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. పిరియాడిక్ చిత్రం కావడంతో విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయట. పవన్ కళ్యాణ్ సినిమా మొత్తం తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో కథని తన భుజాలపై మోసాడని అంటున్నారు.
రికార్డుల మోత ఖాయం
ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ ప్రదర్శించిన డెడికేషన్ స్క్రీన్ పై కనిపిస్తోందని ప్రశంసలు కురిపించినట్లు తెలుస్తోంది. యాక్షన్ సన్నివేశాలు, పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగులు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయని అంటున్నారు. కామెడీ సన్నివేశాలు, రొమాంటిక్ సీన్స్ కూడా బాగా వర్క్ అవుట్ అయినట్లు తెలుస్తోంది. కథలో ఉన్న సనాతన ధర్మంకి సంబంధించిన సెంటిమెంట్ వర్కౌట్ అయితే ఈ చిత్రం రికార్డుల మోత మోగించడం ఖాయం అని అంటున్నారు. కీరవాణి సంగీతం కూడా మరో ఆకర్షణగా నిలిచిందట.

ఇదిలా ఉండగా చిత్ర యూనిట్ వైజాగ్ వేదికగా జూలై 20న గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సన్నాహకాలు చేస్తోంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక రిలీజ్ అవుతున్న తొలి చిత్రం కావడంతో నిర్మాత ఏం రత్నం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఒక రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట. ఆరోజు వైజాగ్ నగరం జనసంద్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.