1. నాగ (2003)
ఎన్టీఆర్ సరసన సద,జెన్నీఫర్ హీరోయిన్లుగా ఏం రత్నం నిర్మాతగా డీకే సురేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తన కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. చిన్న వయసులో రాజకీయ నేపథ్యంలో ఉన్న అలాంటి కథను ఎంచుకోవడం అతి పెద్ద పొరపాటు గా నిలిచింది.
2.ఆంధ్రావాలా (2004)
శివమణి సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత పూరి సొంతంగా రాసుకున్న కథతో దర్శకత్వం వహించిన ఈచిత్రం భారీ ఫ్లాప్ మూటగట్టుకుంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలై అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది.ఈ చిత్రంలో ఎన్టీఆర్ వేసిన ఫ్లాష్ బాక్ కారెక్టర్..దానికి తోడు అతని కంటే వయసులో పెద్దది అయినా సంఘవిని జోడీగా పెట్టడం ఫాన్స్ కి ఏమాత్రం మింగుడు పడలేదు.
3. నా అల్లుడు (2005)
వర ముళ్ళపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అవుట్ అండ్ అవుట్ పేలవమైన కామెడీతో సినిమా పూర్తయ్యేంతవరకు థియేటర్లో ఉంటే చాలా గొప్పే అనే రీతిలో తెరకెక్కింది.
4. నరసింహుడు (2005)
సమరసింహా రెడ్డి లాంటి ఇండస్ట్రీ హిట్ జోడీ నిర్మాత చెంగల వెంకట్రావు, బి.గోపాల్ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం చిత్రీకరణ సమయంలో జరిగిన జాప్యం వలన అనుకున్న బడ్జెట్ కంటే రెండింతలు ఎక్కువ అయింది.
ఆ కాంబినేషన్ పై అంచనాలతో థియేటర్ కి వెళ్లిన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అంతేకాక నిర్మాత విడుదల సమయంలో ఎదురైన అవాంతరాలకు మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకోవడానికి హుస్సేన్ సాగర్ లో దూకడం పెను సంచలనమైంది. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో అదొక చేదు జ్ఞాపకం గా నిలిచింది.
5.శక్తి (2011)
అష్టాదశ శక్తి పీఠాలు, ఈజిప్ట్ మాంత్రికుడు లాంటి తలకు బొప్పి కట్టే విధమైన స్టోరీ లైన్ తో, అప్పటికే హిట్ అయిన కొన్ని చిత్రాల రిఫరెన్స్ లు కొట్టెచ్చెలా కనిపించే అతుకులతో విడుదల అయిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన అశ్వినీదత్ లాంటి నిర్మాత కూడా కొన్నేళ్లు ఇండస్ట్రీలో కనబడకుండా పోయేలా చేసిన ఘనతని దక్కించుకుంది. 48 కోట్లతో నిర్మిస్తే 19 కోట్లు వసూలు చేసింది. అభిమానులు కూడా డైరెక్టర్ మెహర్ రమేష్ పై ఇప్పటికీ ఈ చిత్రం విషయంలో కోపం గానే ఉన్నారు. అంత గొప్ప కళాఖండం.