టాలీవుడ్ నటుడు జగపతి బాబు ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మెప్పించిన సంగతి తెలిసిందే. ఇక గత కొంత కాలంగా ఆయన విలన్ క్యారెక్టర్, సపోర్టింగ్ రోల్స్ చేస్తూ.. ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. బాలయ్య నటించిన లెజెండ్ సినిమాతో విలన్ గా మారిన ఈ స్టార్ హీరో.. ఆ సినిమాకు మంచి గుర్తింపు లభించింది. దీంతో ఆయన సెకండ్ ఇన్నింగ్స్ లో ఎక్కువగా విలన్, క్యారెక్టర్ ఆరిస్టు రోల్స్ చేస్తూ బిజీగా మారిపోయాడు.
ఇక ఈ విలక్షణ నటుడు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గానే కనిపిస్తాడు.సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్టుతో నెటిజన్లతో, ఫ్యాన్స్ తో టచ్ లోనే ఉంటాడు. అయితే తాజాగా ఆయన బర్త్ డే సందర్భంగా ఓ పోస్ట్ పెట్టాడు. ఇప్పటికే ఆయనకు సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ బర్త్ డే విషెష్ చెబుతున్నారు. ఈ క్రమంలో జగ్గు భాయ్ షాకింగ్ పోస్ట్ పెట్టాడు. అది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ తో పాటు.. వైరల్ గా మార్చేశారు.

ఇక ఆ పోస్టులో ఒక ఫోటో పోస్ట్ చేసి సుదీర్ఘ సందేశం రాశారు. ఆ ఫోటోలో జగ్గు భాయ్ ఒక చేతిలో పాల సీసా పట్టుకోగా.. మరో చేతిలో గ్లేన్ ఫిడిచ్ ఆల్కహాల్ సీసా పట్టుకున్నాడు. ఇక దానికి కింద రాసుకువస్తూ… ఎలాగోలా పుట్టేశాను. సిగ్గు లేకుండా అడుగుతున్నాను… మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి.. రెండోది ఎక్కువసేపు ఆలోచించకుండా తొందరగా డిసైడ్ చేయండి. ఈ రెండిట్లో ఏది కొట్టమంటారు అంటూ అడిగారు.

ప్రస్తుతం జగపతి బాబు పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది చూసిన నెటిజన్లు కొందరు రెండు కలిపి కొట్టండని క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. ఇక జగపతి బాబు విషయానికి వస్తే.. ఇటీవల గుంటూరు కారం, సలార్, కాటేరా వంటి సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. ఇక సూర్య నటిస్తున్న కంగువ చిత్రంలోనూ జగపతిబాబు నటించనున్నాడు. ఇక ఆయన మరెన్నో చిత్రాలు చేసి అలరించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
