Jagapathibabu comments on casteism : టాలీవుడ్ లో సీనియర్ హీరోగా, విలన్ మెప్పించిన విలక్షణ నటుడు జగపతిబాబు. హీరోగా చేస్తూ డక్కముక్కీలు పడుతున్న సమయంలో లెజెండ్ లో జితేంద్ర కారెక్టర్ తో జగపతిబాబు లైఫ్ ఒక్కసారిగా మారిపోయింది. తన నటనలో మరో కోణాన్ని ప్రేక్షకులకు చూపించాడు. మూవీ ఈవెంట్స్ కి, మీడియాకు దూరంగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు ఆయన చేసే కామెంట్స్ వైరల్ అవుతుంటాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ క్యాస్టిజంను తప్పు పట్టారు. జగపతి బాబు పెద్ద కుమార్తె శ్వేత ఫారెనర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ పెళ్లి జరిగే టైంలో కొందరు కమ్మ కులస్తులకు ఆయన్ని బెదిరించినట్లు ఆయన తెలిపాడు. ఇదే విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో ప్రస్తావించగా.. వాళ్లెవరో వేస్ట్ ఫెలోస్ అంటూ హాట్ కామెంట్స్ చేశారు జగపతిబాబు.
నా కూతురు ఓ విదేశీయుడిని పెళ్లాడితే తనకు, తన కుటుంబానికి లేని అభ్యంతరం వేరే వాళ్లకు ఏంటని జగపతిబాబు ప్రశ్నించాడు. ఈ కుల పిచ్చికి తాను పూర్తి వ్యతిరేకమని.. ఇంట్లో పనివాళ్లు వేరే కులస్థులు కావాలి, ఒక అమ్మాయి దగ్గరికి వెళ్లి పడుకునేటప్పుడు కులం చూడరు.. కానీ పెళ్లి దగ్గరికి వచ్చేసరికి కులం కావాలా అని జగపతిబాబు ప్రశ్నించాడు.
నేను నాకు ఇచ్చుకునే ఇంపార్టెన్సే తప్ప మరోటి కనపడదు. కమ్మ కులంలో పుట్టాను కాబట్టి దానికి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటారు. మనం మంచి.. అవతలవాడు మంచోడు కాదు. వాళ్లు చిన్న క్యాస్ట్ .. చెత్త క్యాస్ట్ అంటుంటారు. ఏంటిది? అవన్నీ పిచ్చి మాటలు’’ అన్నారు ఆయన. తాను కమ్మవారికో, ఏదో ఒక కులానికో వ్యతిరేకం కాదని.. కుల పిచ్చికి వ్యతిరేకం అని జగపతిబాబు స్పష్టం చేశాడు.