Jr NTR Watch Cost : ఆస్కార్ వేడుకలు అట్టహాసంగా ముగిసిన విషయం తెలిసిందే. ఆస్కార్ వేడుకల్లో మనోళ్ల సందడి మాములుగా లేదు. సోషల్ మీడియాలో సైతం మన తారాల గురించే చర్చ. RRR మూవీ నుంచి నాటు నాటు పాటకు ఆస్కార్ రాగా.. టాలీవుడ్ హీరోలు మన తడాఖా చూపించారు. అయితే రామ్ చరణ్, తారక్ కు ఆస్కార్ రాలేదు కానీ ఇంటర్నేషనల్ మీడియాలో మంచి గుర్తింపు లభించింది. ఈ ఇయర్ సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రస్తావన వచ్చిన నటుల్లో
తారక్, రామ్ చరణ్ మొదటి రెండు స్థానాల్లో ఉండగా.. ఎక్కువగా వెతికిన సినిమాల జాబితాలో RRR, The Elephant Whisperers ఉండడం విశేషం. మొత్తంగా ఇండియన్ మూవీస్ ఆస్కార్ ఈవెంట్ లో సత్తా చాటాయని చెప్పొచ్చు. అయితే ఈ గ్రాండ్ ఈవెంట్ లో స్టార్స్ ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ లో అలరించగా మన టాలీవుడ్ స్టార్స్ అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ క్రమంలోనే మన నెటిజన్స్ కన్ను ఎన్టీఆర్ వాచ్‌పై పడింది.
అతడు ధరించిన వాచ్ విలువ ఎంత అని తెలుసుకునే పనిలో పడ్డారు. ఇంతకీ ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్ ‘‘Patek Philippe Nautilus Travel Time’’. ఈ వాచ్ ధర అక్షరాల 190,000 డాలర్స్. అంటే.. మన ఇండియన్ కరెన్సీలో ఒక కోటి యాభై ఆరు లక్షల పదమూడు వేల నూట యాభై ఐదు (1,56,13,155) రూపాయలు. కాగా.. ఈ వాచ్ ధర తెలుసుకుని నెటిజన్స్ ప్రస్తుతం షాక్‌లో ఉన్నారు.