స్వర్గీయ నందమూరి తారకరామారావు పేరు పెట్టుకొని ఇండస్ట్రీలో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ 18 ఏళ్ళ వయస్సులోనే ఎలాంటి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు వచ్చింది. తారక్ తర్వాత చేయబోయే సినిమాలపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఏదైనా ఓ చిన్న న్యూస్, పిక్ లేదా అప్‌డేట్ వచ్చిందంటే చాలు.. టాప్ ట్రెండింగ్‌లో ఉంచుతారు ఫ్యాన్స్.
‘ఆర్ఆర్ఆర్’ మూవీతో తారక్‌కి వరల్డ్ వైడ్ గుర్తింపు వచ్చింది. ఇంటర్నేషనల్ స్థాయిలో పలు ప్రముఖ పత్రికలు, మ్యాగజైన్స్ ఆర్టికల్స్ రాశాయి. అయితే ఇటీవల ఎన్టీఆర్ షూటింగ్ అప్ డేట్స్ కూడా పెద్దగా ఏం లేవు. దీంతో జూనియర్ ఎన్టీఆర్, భార్య, పిల్లలతో కలిసి హాలీడే ట్రిప్ ప్లాన్ చేశాడు. దాదాపు ఒక నెల లాంగ్ అండ్ పర్సనల్ టూర్ ఇది. ఎయిర్ పోర్టులో తనయులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లతో తారక్ నడుచుకుంటూ వెళ్తున్న పిక్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్, యాడ్ షూటింగ్.. ఇలా బిజీ బిజీగా గడపడంతో కాస్త ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి యూఎస్ఎ బయలు దేరాడు యంగ్ టైగర్. రీసెంట్‌గా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ గ్లింప్స్‌కి వాయిస్ ఓవర్ ఇచ్చి.. మరోసారి తన మాడ్యులేషన్‌తో మెస్మరైజ్ చేశాడు.. కొరటాల శివతో చేయబోయే కొత్త సినిమా (NTR 30) ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. తారక్ హాలీడే నుండి తిరిగొచ్చాక షూటింగ్ మొదలు పెడతారని.. ఆ లోగానే టీమ్ ఓ అప్‌డేట్ ఇవ్వనుందని తెలుస్తుంది.