Kiran Abbavaram Marriage : స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం.. తన తొలి సినిమా హీరోయిన్ తో పెళ్లికి రెడీ, నిశ్చితార్థం తేదీ ఇదే
యువ హీరో కిరణ్ అబ్బవరం వరుస చిత్రాలు చేస్తూ కష్టపడుతున్నాడు. అతడు నటించే చిత్రాలు పర్వాలేదనిపించే విధంగా రాణిస్తున్నాయి. కానీ సూపర్ హిట్స్ మాత్రం కావడం లేదు. అయితే ప్రతి చిత్రాన్ని కిరణ్ అబ్బవరం ప్రాణం పెట్టి చేస్తున్నాడు.
కిరణ్ అబ్బవరం రాజావారు రాణిగారు చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో రహస్య గోరఖ్ హీరోయిన్ గా నటించింది. తాజాగా అభిమానులందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఆమెతోనే కిరణ్ సబ్బవరం పెళ్ళికి రెడీ అవుతున్నాడు. కిరణ్ అబ్బవరం, రహస్య మధ్య ఐదేళ్ల నుంచి రహస్యంగా ప్రేమ వ్యవహారం సాగుతోంది.
View this post on Instagram
వీరిద్దరికి త్వరలో పెళ్ళికి రెడీ అవుతున్నారు. ఎల్లుండే అంటే బుధవారం మార్చి 13న కిరణ్ అబ్బవరం, రహస్య నిశ్చితార్థం ఖరారైంది. ఫ్యాన్స్ ఇది ఫ్యాన్స్ కి స్వీట్ షాక్ అనే చెప్పాలి. ఐదేళ్ల ప్రేమ బంధాన్ని వీరిద్దరూ పెళ్లితో నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లనున్నారు.
Rohan Roy : దేవుడా.. సుద్దపూస కుర్రాడి కోసం స్పెషల్ ఫ్లైట్, రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..
రాజావారు రాణి గారు చిత్రంలో జంటగా నటించిన వీరిద్దరూ మొదట స్నేహితులుగా ఉన్నారు. నెమ్మదిగా అభిప్రాయాలు కలవడంతో ప్రేమికులయ్యారు. ఏది ఏమైనా ఈ యువ హీరోకి అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
