జనసేనాధ్యక్షుడుగా అటు రాజకీయాల్లోనూ, పవర్ స్టార్ గా ఇటు సినిమాల్లోనూ తనదైన శైలిలో రాణిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఆయన సినిమాలు సంవత్సరానికి ఒక్కటైనా రిలీజ్ అవ్వాలని కోరుకుంటారు ఆయన అభిమానులు. అది కొత్త సినిమానా రెండవసారి రిలీజ్ అయినా సినిమానా అనేది వాళ్లకు మ్యాటర్ కానే కాదు. స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలు ఉర్రుతలూగిపోతారు. తొలిప్రేమ లాంటి సినిమా ఒక్కో అభిమాని పది సార్లు అయినా థియేటర్ లో చూసేసినా, టివి లో వస్తే అదే ఫస్ట్ టైం చూస్తున్నట్లు చూసేస్తారు. మరి ఖుషి లాంటి కేరీర్ హిట్ సినిమా 4కే లో వస్తే వదిలేస్తారా.. ట్రెండ్ చేసేయరూ.. అదే జరిగింది.
పవన్ కళ్యాణ్ – ఖుషి సినిమా రీ-రిలీజ్ అయ్యి థియేటర్ లలో అసాధారణ విజయాన్ని సాధించింది. అభిమానులు పవన్ కళ్యాణ్ అప్పటి లుక్స్ ఉన్న ఫొటోలతో సోషల్ మీడియాను హోరెత్తించారు. రీ-రిలీజ్ కలెక్షన్లలో ఖుషి సినిమా ఇపుడు ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. అంతే కాదు జల్సా రి-రిలీజ్ రికార్డ్‌ను బీట్ చేసి, అత్యంత విజయవంతమైన రీ-రిలీజ్‌గా అవతరించింది. జల్సా రి-రిలీజ్ మొదటి రోజు 3 కోట్లు కలెక్ట్ చేస్తే ఖుషి రి-రిలీజ్ ఏకంగా 3.5 కోట్లు(Kushi Re-Release Collections) కలెక్ట్ చేయటం మామూలు విషయం కాదు. ఇది కొన్ని సినిమాల ఫస్ట్ రిలీజ్ కలెక్షన్ల కంటే ఎక్కువ. టోటల్ గా ఈ మూవీ ఇప్పటి వరకూ 4.5 కోట్ల పైన వసూలు చేసింది అని టాక్.. ఏమైనా పవన్ కళ్యాణ్ రేంజే వేరు…