Mahesh Babu : హైదరాబాద్ శివారులో ఖరీదైన ల్యాండ్ కొన్న మహేష్ బాబు.. ఎమ్మార్వో ఆఫీస్ లో నమ్రత
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమాకి సంబంధించిన ప్రిపరేషన్ లో ఉన్నారు గుంటూరు కారం చిత్రం ఆశించిన విధంగా సక్సెస్ కాలేదు. దీనితో ఫ్యాన్స్ మొత్తం రాజమౌళి చిత్రం కోసమే ఎదురుచూస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కే ఈ చిత్రం పూర్తి కావడానికి ఎన్నేళ్లు పడుతుందో చూడాలి.
ఒకవైపు మహేష్ సినిమాలు చేస్తూనే బిజినెస్, ఫ్యామిలీ ఇలా అన్ని విషయాలని బ్యాలెన్స్ చేస్తుంటారు. మహేష్ సినిమాలతో బిజీగా ఉన్నా బిజినెస్ లో హెల్ప్ చేయడం, ఆ వ్యవహారాలు చూసుకోవడంలో నమ్రత ముందుంటారు. మహేష్ బాబుకి పలు వ్యాపారాలు ఉన్న సంగతి తెలిసిందే. మహేష్ కి సంబందించిన లావాదేవిలని నమ్రత చూసుకుంటారట.
తాజాగా మహేష్ బాబు హైదరాబాద్ నగర శివారులో ఖరీదైన భూమిని కొన్నారు. మహేష్ బాబు శంకరపల్లి సమీపంలో గోపాలపురంలో మహేష్ 2.5 ఎకరాల ల్యాండ్ కొన్నట్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆ ల్యాండ్ కి సంబందించిన రిజిస్ట్రేషన్ కోసం నమ్రత శంకర్ పల్లి ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లారు.
మహేష్ సతీమణి వచ్చిందని తెలియయడంతో జనం అక్కడికి ఎగబడ్డట్లు. కార్యాలయ సిబ్బంది నమ్రతతో సెల్ఫీలు తీసుకున్నారు. నమ్రత పేరుమీదే ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయినట్లు తెలుస్తోంది. ఆ ల్యాండ్ విలువ కోట్లల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్ల క్రితం ఎన్టీఆర్ కూడా అదే ప్రాంతంలో 6 ఎకరాల ఫామ్ హౌస్ ని సొంతం చేసుకున్నారు.