మంచు మనోజ్ నటించిన సినిమా సిల్వర్ స్క్రీన్ పై మెరిసి చాలా కాలమే అవుతోంది. మంచు మనోజ్ తన క్యారెక్టర్ తో యువతతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే మనోజ్ కి సరైన హిట్ పడడం లేదు. త్వరలో తన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మనోజ్ ప్రయత్నిస్తున్నాడు.
అయితే మనోజ్ నటించిన చిత్రాలు రిలీజ్ కానప్పటికీ ఈ మంచు కుర్రాడు తరచుగా వ్యక్తిగత విషయాలుతో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. గత ఏడాది హైడ్రామా నడుమ మంచు మనోజ్.. భూమా మౌనికని రెండవ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గతంలో మంచు మనోజ్ కి ఒక అమ్మాయితో పెళ్లి జరగగా వీళ్ళిద్దరూ విడిపోయారు. దీనితో మనోజ్ భూమా మౌనికని ప్రేమించి వివాహం చేసుకున్నారు.
అయితే ఈ పెళ్లి మోహన్ బాబుకి ఇష్టం లేదనే ప్రచారం జరిగింది. భూమా మౌనికని మనోజ్ పెళ్లి చేసుకోవడాన్ని మంచు ఫ్యామిలీ వ్యతిరేకించిందట. అయితే తమ్ముడు మంచు లక్ష్మి మాత్రం అండగా నిలిచింది. ఇదంతా పక్కన పెడితే మోహన్ బాబు మరో అమ్మాయితో మంచు మనోజ్ పెళ్లి చేయాలనుకున్నారట.
ఆ అమ్మాయి ఎవరో కాదు.. మేజర్ చంద్రకాంత్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన శ్రేష్ట. శ్రేష్ట టాలీవుడ్ లో అనేక చిత్రాల్లో చిరంజీవి, బాలకృష్ణ ఇలా టాప్ హీరోల చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. హిట్లర్, సమరసింహారెడ్డి చిత్రాలతో పాటు ఇంకా అనేక చిత్రాల్లో ఆమె నటించింది. ఇప్పుడు ఆమె యుక్తవయసులోకి వచ్చింది.
తాజాగా ఇంటర్వ్యూలో శ్రేష్ట మాట్లాడుతూ తనకి వచ్చిన పెళ్లి ప్రపోజల్స్ గురించి చెప్పుకొచ్చింది. మంచు మనోజ్ తో పెళ్లి ప్రపోజల్ వచ్చింది అంట కదా అని యాంకర్ ప్రశ్నించగా.. దానికి సమాధానం ఇచ్చేందుకు శ్రేష్ట ఇబ్బంది పడింది. ఆ విషయాలు ఇప్పుడు ఎందుకు లేండి అని దాటవేసే ప్రయత్నం చేసింది. అయితే యాంకర్ వివరించాలని కోరగా.. నిజమే వచ్చింది అని సమాధానం ఇచ్చింది.
మోహన్ బాబు గారే మా ఇంటికి వచ్చి మా అమ్మానాన్నని అడిగారు. కానీ తానే నో చెప్పినట్లు శ్రేష్టా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎందుకు నో చెప్పాల్సి వచ్చింది అని అడిగా దానికి సమాధానం ఇవ్వలేదు. ఇక ఈ విషయాన్ని వదిలేయండి అని కోరింది. అయితే మోహన్ బాబు శ్రేష్ఠని అడిగింది మనోజ్ తో మొదటి పెళ్లి కోసమా లేదా రెండవ పెళ్లి కోసమా అనే క్లారిటీ లేదు.