మృగరాజు (2001)
మెగాస్టార్ కెరియర్లో అతిపెద్ద ఫ్లాప్ చిత్రం ఇది. గుణశేఖర్ దర్శకత్వంలో దేవి వర ప్రసాద్ నిర్మాతగా తెరకెక్కిన ఈ చిత్రం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. సంక్రాంతి బరిలో నరసింహనాయుడు చిత్రానికి పోటీగా విడుదలైన ఈ చిత్రం కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు కన్నీళ్లు పెట్టుకునే స్థాయి ఫ్లాప్ అయింది. ఈ చిత్రం దెబ్బకి చాలామంది డిస్ట్రిబ్యూటర్లు కనుమరుగైపోయారు.
మెకానిక్ అల్లుడు (1993)
ఈ చిత్రానికి ముందు విడుదలైన ముఠామేస్త్రి మంచి హిట్ చిత్రంగా నిలిచింది. ఆ సినిమా ప్రభావం తో బి.గోపాల్ దర్శకత్వంలో గీతాఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ఈ చిత్రంలో సీనియర్ హీరో అక్కినేని నాగేశ్వరరావు కీలక పాత్ర పోషించడం వలన ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. వేసవి సెలవుల్లో విడుదలైన ఈ చిత్రం పేలవమైన కామెడీతో, తలా తోక లేని స్క్రీన్ ప్లే వలన బాక్సాఫీసు ముందు బోర్లా పడింది.
SP పరశురామ్ (1994)
రీమేక్ చిత్రాల స్పెషలిస్ట్ రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో
(వల్టర్ వెట్రివెల్) అనే తమిళ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం చిరంజీవి కెరీయర్ ని ఎన్నడూ ఎదుర్కోనంత సంక్షోభంలోకి నెట్టేసింది. శ్రీదేవి హీరోయిన్ కానీ ఆమెకు కళ్లు కనపడవు. అంత పెద్ద అందాల తారని కళ్ళు లేని పాత్రలో చూడడానికి ప్రేక్షకులు ఇష్టపడలేదు. గీతా ఆర్ట్స్ మరియు జీకే రెడ్డి, ముఖేష్ అదాని సంయుక్తంగా నిర్మించిన చిత్రం భారీ నష్టాలు చవి చూసింది.
ది జెంటిల్ మాన్ (1994)
శంకర్ దర్శకత్వంలో అర్జున్ హీరోగా తెరకెక్కిన జెంటిల్ మాన్ చిత్రం తెలుగు తమిళ భాషల్లో విడుదలై సూపర్ డూపర్ హిట్ అయ్యింది. భారీ పోటీ మధ్యన ఆ చిత్రం హిందీ రీమేక్ రైట్స్ గీతాఆర్ట్స్ దక్కించుకుంది. చిరంజీవి, జుహీ చావ్లా, హీరోహీరోయిన్లుగా మహేష్ బట్ దర్శకత్వం, ఎ.ఆర్.రెహమాన్ సంగీత సారధ్యం ఇంకేముంది భారీ కాంబినేషన్ సిద్ధం. కాని తమిళ్, తెలుగు ప్రేక్షకులు నెత్తి మీద పెట్టుకున్న అదే కథని హిందీ ప్రేక్షకులు పెదవి విరిచి పక్కన పడేశారు.
Also Read: ఇంట్లో బల్లులు కొట్లాడుకుంటే దేనికి సంకేతమో తెలుసా..!?
భారీ యాక్షన్ ఎపిసోడ్ లతో నిర్మాణ వ్యయం తడిసి మోపెడు అయ్యింది. అయినా కథ మీద నమ్మకంతో నిర్మాత అల్లు అరవింద్ సొంతంగా విడుదల చేశారు. విడుదలైన మూడు వారాల్లో డబ్బాలు అన్ని తిరిగి వచ్చేశాయి. గీతా ఆర్ట్స్ కి కెరియర్లోనే ఎదుర్కోలేని గట్టి దెబ్బ ఈ చిత్రం ద్వారా తగిలింది.
బిగ్ బాస్ (1995)
చిరంజీవి డాన్ పాత్రలో బారీ మాస్ యాక్షన్ ప్యాకేజీ చిత్రం.
విజయబాపినీడు దర్శకత్వంలో మాగంటి రవీంద్రనాథ్ చౌదరి ఈ చిత్రం మరోసారి అభిమానులు పెట్టుకున్న ఆశలను నీరుగార్చింది.
బప్పిలహరి సంగీతం లో విడుదలైన పాటలు చిత్రంపై ఎన్నో అంచనాలు ఏర్పడేలా చేసింది కానీ సినిమా కథాగమనంలో పస లేకపోవడంతో భారీ ఫ్లాప్ ని మూటగట్టుకుంది.