మెగా కోడలు లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ భామ పెళ్లి తర్వాత మెగా కోడలిగా బాధ్యతలు నిర్వహిస్తునే.. అటు సినిమాలతో బిజీగా మారిపోయింది. ఇటీవల ఈ ముద్దుగుమ్మ మిస్ ఫర్ ఫెక్ట్ సిరీసుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీసులో బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ కీలక పాత్రలో నటించాడు. విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహించాడు.
మిస్ పర్ ఫెక్ట్ సిరీస్ వీక్షించిన నాగబాబు
ఇక ఈ వెబ్ సిరీసును అన్నపూర్ణ సూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్ని ప్లస్ హాట్ స్టార్ వేదికగా ఫిబ్రవరి 2 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. విడుదల అయిన మొదటి రోజు నుంచి ఈ సిరీసుకు మంచి ఆదరణ వచ్చింది. పాజివ్ రివ్యూలు వచ్చాయి. ఇదిలా ఉంటే ఈ వెబ్ సిరీసును తాజాగా మెగా బ్రదర్ నాగబాబు వీక్షించారు.
Mahesh babu Update : మహేష్ కోసం ఆ హాలీవుడ్ హీరోయిన్ ని దింపుతున్న జక్కన్న..

మెగా కోడలు సిరీసుపై నాగబాబు రివ్యూ
అనంతరం తన ట్విట్టర్ వేదికగా రివ్యూను రాసుకువచ్చారు. కోడలు నటించిన వెబ్ సిరీస్ గురించి చిన్న నోట్ రాసుకువచ్చారు. లావణ్య త్రిపాఠి నటించిన ‘మిస్ పర్‌ఫెక్ట్’ వెబ్ సిరీస్ చూశాను.. చాలా బాగుందని వెల్లడించారు. ఎంతో గ్రిప్పింగ్‌గా, ఫన్నీగా ఉంది… అందరూ తప్పక చూడండి’ అని పోస్ట్ చేశారు. ఇక మామ నాగబాబు పెట్టిన పోస్ట్ మీద లావణ్య సైతం స్పందించారు. స్మైలీ ఎమోజీలను షేర్ చేసి తన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది. ప్రస్తుతం వీరి ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
Telugu Jyothishyam Bhakthi : ఏ ఫలాల నైవేద్యం తో ఏమేమి ఫలితాలు ఉంటాయో తెలుసా..?

సినిమాలతో బిజీగా లావణ్య త్రిపాఠి
ఇక లావణ్య విషయానికి వస్తే.. అటు ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తునే సినిమాలు చేసే బిజీలో ఉంది. ప్రస్తుతం తన చేతిలో పలు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. తమిళ సినిమాలోనూ నటిస్తుందట. అటు వరుణ్ తేజ్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ విడుదలకు సిద్దంగా ఉంది. పాన్ ఇండియా లెవెల్ లో రానుంది. ఇక ఈ సినిమాతో పాటు మట్కా చిత్రంలోనూ నటిస్తున్నారు.
