బాహుబలి ఐటెం బ్యూటీతో నటుడి అసభ్యకర ప్రవర్తన.. సెట్స్ లోనే చెంప పగలగొట్టిందట
టెంపర్, బాహుబలి, కిక్ 2, లోఫర్ లాంటి చిత్రాల్లో ఐటెం సాంగ్స్ చేసి పాపులర్ అయింది నోరా ఫతేహి. నోరా ఫతేహి ప్రస్తుతం ఇండియా మొత్తం క్రేజ్ సొంతం చేసుకుంది. స్టన్నింగ్ అనిపించే స్ట్రక్చర్ తో కుర్రాళ్ళని గిలిగింతలు పెట్టే సొందర్యం ఆమె సొంతం.
సోషల్ మీడియాలో కూడా నోరా ఫతేహి ఒక రేంజ్ లో గ్లామర్ ఒలకబోస్తూ ఉంటుంది. గ్లామర్ ఆరబోయడంలో నోరా ఫతేహికి ఎలాంటి హద్దులు ఉండవు. అయితే నోరా ఫతేహి తరచుగా వివాదాల్లో నిలుస్తోంది. ఆ మధ్యన కాన్ మాన్ సుఖేష్ చంద్రశేఖర్ ఘరానా మోసం కేసులో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తో పాటు నోరా పేరు కూడా గట్టిగా వినిపించింది.
ప్రస్తుతం ఈ కేసుని ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఇంటర్వ్యూలో నోరా ఫతేహి చిత్ర పరిశ్రమలో తనకు ఎదురైనా చేదు అనుభవాలని గుర్తు చేసుకుంది. నటీమణులని చిత్ర పరిశ్రమలో ఎలా లైంగికంగా వేధించే ప్రయత్నం చేస్తారో గతంలో కొన్ని సంఘటనలు చూశాం. నోరా ఫతేహి కి కూడా అలాంటి అనుభవమే ఎదురైందట.
ఆమె నటించిన రోర్ : టైగెర్స్ ఆఫ్ సుందర్ బన్స్ అనే చిత్ర షూటింగ్ సమయంలో తనకి వేధింపులు ఎదురయ్యాయట. ఈ చిత్ర షూటింగ్ బంగ్లాదేశ్ లో జరిగింది. ఆ సమయంలో ఒక కోస్టార్ సెట్స్ లో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని నోరా రివీల్ చేసింది. అయితే హద్దులు మీరెలా ప్రవర్తించడంతో అతడి చెంప పగలగొట్టినట్లు నోరా పేర్కొంది.
ఆ తర్వాత కూడా అతడు తన జుట్టు లాగుతూ చిరాకు పెట్టినట్లు నోరా తెలిపింది. ఆగ్రహంతో అతడి మీదికి దాడికి దిగాను. చివరకు డైరెక్టర్ కలగజేసుకుని సర్ది చెప్పాల్సి వచ్చిందని నోరా పేర్కొంది. నోరా ఫతేహి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.