NTR Devara : దేవరలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్.. పాత్రల పేర్లు లీక్ ?
ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో 300 కోట్లకి పైగా బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. డైరెక్టర్ కొరటాల ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగం సమ్మర్ లో రిలీజ్ కావాల్సి ఉన్నా షూటింగ్ పూర్తి కాకపోవడం వల్ల అక్టోబర్ కి వాయిదా పడింది.
కొత్త రిలీజ్ డేట్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ రీసెంట్ గా పోస్టర్ వదిలారు. సముద్రం నేపథ్యంలో జరిగే యాక్షన్ డ్రామా అని కొరటాల ఆల్రెడీ ఈ చిత్రం గురించి తెలిపారు. ఇటీవల విడుదలైన టీజర్ సినిమా ఎంత గ్రాండ్ గా ఉండబోతోందో తెలియజేసింది. ఎన్టీఆర్ యాక్షన్ అవతార్ లో విధ్వంసం సృష్టిస్తున్నారు.
ఇంతవరకు కథ గురించి ఎలాంటి హింట్స్ లేవు. అయితే ముందు నుంచి ఎన్టీఆర్ ఈ చిత్రంలో డ్యూయెల్ రోల్ లో నటించబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా విడుదలైన పోస్టర్ లో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ కంఫర్మ్ అని.. పాత్రల పేర్లు కూడా లీక్ అయ్యాయని ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.

పోస్టర్ లో దేవర టైటిల్ లో వర అనే అక్షరాలని రెడ్ కలర్ తో హైలైట్ చేశారు. పోస్టర్ ఎన్టీఆర్ లుక్ కూడా చాలా యంగ్ గా డిఫెరెంట్ గా ఉంది. అంతకు ముందు టీజర్ లో ఎన్టీఆర్ లుక్ వేరు.. ఇప్పుడు పోస్టర్ లో ఉన్న లుక్ వేరు. అంటే ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. లేటెస్ట్ పోస్టర్ లో వర అనే అక్షరాలని హై లైట్ చేశారు అంటే ఆ పాత్ర పేరు వర. అంతకు ముందు టీజర్ లో కనిపించింది దేవ్ అని అంటున్నారు.
అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. మొత్తంగా దేవర చిత్రం అక్టోబర్ 10న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా.. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.