Oy heroine: కొంతమంది మంచి సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి ఇండస్ట్రీకి వచ్చినప్పటికి ఆశించిన స్థాయిలో మాత్రం క్లిక్ కాలేకపోతుంటారు. ఈ క్రమంలో మొదటగా తమ కుటుంబ సభ్యులు ప్రోత్సాహంతో ఒకట్రెండు చిత్రాల్లో నటించి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తర్వాత అవకాశాలు దక్కించుకోలేక వ్యాపారం, ఉద్యోగాలు, అలాగే ఇతర దేశాలకి వెళ్ళిపోయి సెటిల్ అయివాళ్ళు కూడా లేకపోలేదు. అయితే తెలుగులో ప్రముఖ హీరో సిద్ధార్థ హీరోగా నటించిన ఓయ్ చిత్రంలో హీరోయిన్ గా నటించి తెలుగు తెరకు పరిచయమైన యంగ్ హీరోయిన్ బేబీ షామిలీ కూడా ఈ కోవకే చెందుతుందని చెప్పవచ్చు. అయితే ఇటీవలే ఈ అమ్మడు నటించిన ఓయ్ చిత్రం తెలుగులో ప్రేమికుల దినోత్సవ కానుకగా రీ రిలీజ్ అయ్యింది. దీంతో ఓయ్ చిత్ర హీరోయిన్ గురించి సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ వెతుకుతున్నారు.
ఓయ్ చిత్రం మంచి హిట్:
ఇక పూర్తీ వివరాల్లోకి వెళితే బేబీ షామిలీ అక్క శాలినీ కోలీవుడ్ మరియు టాలీవుడ్ లో అప్పట్లోనే మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తమిళ ప్రముఖ హీరో అజిత్ ని ప్రేమించి పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది. పెళ్ళయిన తర్వాత శాలినీ మళ్ళీ సినిమాల్లో కనిపించలేదు. ఈ క్రమంలో తన సోదరి అయిన బేబీ షామిలిని ఇండస్ట్రీ హీరోయిన్ గా పరిచయం చేసింది. అయితే ఓయ్ చిత్రం అప్పట్లో మంచి హిట్ అయ్యింది.

వరుస చిత్రాలు ఫ్లాప్ల్ :
కానీ ఆ తర్వాత బేబీ షామిలి హీరోయిన్ గా నటించిన వల్లీమ్ తేట్టి పుల్లీమ్ తేట్టి (మలయాళం) , వీర శివాజీ (తమిళం) చీతరాలు డిజాస్టర్ గా నిలిచాయి. ఇక ఓయ్ చిత్రహం తర్వాత తెలుగులో ఈ అమ్మడు నటించిన అమ్మమ్మగారిల్లు చిత్రం కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. దీంతో అప్పటికే సినిమా ఇండస్ట్రీలో తన భవిష్యత్ ఏంటో అర్థం చేసుకున్న బేబీ షామిలి సినిమాలకి బ్రేక్ ఇచ్చింది.
పూర్తిగా మారిపోయిన బేబీ షామిలి :
కాగా ప్రస్తుతం బేబీ షామిలి తన కుటుంబ సభ్యులతో కలసి దుబాయ్ దేశంలో నివాసం ఉంటున్నట్లు సమాచారం. అయితే ఇటీవలే ఈ అమ్మడు తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసిన వీడియొ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియొలో బేబీ షామిలి లేటెస్ట్ లుక్ ని చూసిన అందరూ ఆశ్చర్యపోతున్నారు. కాగా ఒకప్పడు చక్కటి ముఖ కవళికలు, అందం అభినయంతో కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు లుక్స్ పూర్తీగా మారిపోయాయి.
బేబీ షామిలీ లేటస్ట్ వీడియొ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.