Pawan Kalyan Remuneration : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఓ వైపు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటూనే సినిమా షూటింగుల్లో తీరికలేని షెడ్యూల్ గడుపుతున్నాడు. పవన్ ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నాడు. క్రిష్ డైరెక్షన్ లో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్, సుజీత్ దర్శకత్వంలో ది ఓజీలో నటిస్తుండగా
తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి షూటింగ్ కూడా ప్రారంభించారు. ఈ చిత్రం తమిళ్ లో సూపర్ హిట్ అయిన వినోదాయ సీతమ్ కు రిమేక్ కాగా దీన్ని సముద్రఖని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది కాగా ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో
యంగ్ హీరో, పవన్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. అయితే ఈ సినిమాకు పవన్ 15 రోజుల కాల్ షీట్స్ ఇచ్చిన్నట్టు సమాచారం. ఈ 15 రోజులకు పవన్ తీసుకునే రెమ్యూనరేషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 15 రోజులకు గాను పవర్ స్టార్ ఏకంగా 50కోట్లు తీసుకుంటున్నట్టు టాక్ వినిపిస్తుంది.
ఈ లెక్కన ఒక్క రోజుకి 3.3 కోట్లు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఒక్క రోజుకి 3 కోట్లు అంటే మాములు విషయం కాదు. పవన్ క్రేజ్, స్టామినా చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇదిలావుండగా ఈ రిమేక్ చిత్రానికి దేవర లేదా దేవుడు అనే టైటిల్ ఖరారు చేయనున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా ఈ మూవీకి పవన్ రెమ్యూనరేషన్ హైలైట్ గా నిలిచింది.